Nagababu: న‌రేష్ వ్యాఖ్య‌ల‌ను తిప్పికొట్టిన నాగ‌బాబు..అన్న‌య్య ఎన్న‌డు అలా వ్య‌వ‌హ‌రించ‌లేదంటూ చుర‌క‌

Nagababu: మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు ముగిసిన వేడి చ‌ల్లార‌లేదు. ఒకరిపై ఒక‌రు దూష‌ణ‌లు చేసుకుంటూనే ఉన్నారు. హోరాహోరీ పోరులో ప్రకాశ్‌రాజ్‌పై మంచు విష్ణు విజయం సాధించిన తర్వాత ‘మా’ సభ్యత్వానికి మెగా బ్రదర్‌, నటుడు నాగబాబు రాజీనామా చేయగా, ఆ త‌ర్వాత ప్ర‌కాశ్ రాజ్ ఆ వెంట‌నే ప్రకాశ్ రాజ్ ప్యానెల్ స‌భ్యులు రాజీనామా చేశారు. దీంతో వ్య‌వ‌హారం మ‌రింత హీటెక్కింది.

Nagababu Counter to Naresh Comments
Nagababu Counter to Naresh Comments

రాజీనామా అనంతరం తొలిసారి మీడియాతో ముచ్చటించిన మెగా బ్రదర్‌ నాగబాబు, నరేశ్‌ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించాడు. సినీ పరిశ్రమకు పెద్దగా వ్యవహరించాలని తన అన్నయ్య(చిరంజీవి) ఎప్పుడు అనుకోలేదన్నాడు. పరిశ్రమకు చెందిన నటీనటులు, అభిమానులు ఎవరైనా కష్టమంటు ఇంటికి వస్తే ఆయన వారికి చేతనైనంత సాయం చేశారని పేర్కొన్నాడు.

జనరల్‌ ఎలక్షన్‌లలో ఎలాంటి కుట్రలు జరుగుతాయో అవన్నీ ‘మా’ ఎన్నికల్లో జరిగాయి. సభ్యుల సంక్షేమం, అసోసియేషన్‌ అభివృద్థికి ఎలాంటి కార్యక్రమాలు చేపడతాం అన్న విషయాలతో ఎన్నికల్లో నిలబడతారు. ప్రాంతీయవాదం, కులంతోయ ప్రకాశ్‌రాజ్‌ వృత్తిపరమైన విషయాలను తెరపైకి తీసుకువచ్చి పర్సనల్‌ ఇమేజ్‌కి ఇబ్బందికలిగేలా ఎదుటి ప్యానల్‌ సభ్యులు కామెంట్‌ చేశారు. అతనికి సపోర్టర్‌గా నేను వారికి కౌంటర్‌ ఇచ్చాను.

ఇన్నాళ్లు ఈ అసోసియేషన్‌లో భాగమైనందుకు ఎంతో గర్వంగా ఫీలయ్యాను. తెలుగువాళ్లకు ప్రాంతీయవాదం ఉండదు. మంచి హృదయంతో వ్యవహరిస్తారనుకున్నా. కానీ, ఎన్నికల తర్వాత ఇలాంటి సంకుచితమైన అసోసియేషన్‌లో ఉండాలనిపించలేదు. అలందుకే మనస్థాపంతో బయటకు వచ్చేశాను. ఇకపై ఈ అసోసియేషన్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు. మరో అసోసియేషన్‌ పెట్టే ఆలోచన తమ కుటుంబానికి లేదు’’ అని అన్నారు.

అన్న‌య్య పెదరాయుడిలా సింహాసనంపై కూర్చొని పెద్దరికం చలాయిస్తానని ఎప్పుడూ అనలేదు. ఆయనకు అంత అహంకారం లేదు’ అని నాగబాబు అన్నారు . కాగా ‘మా’ ఎన్నికల ఫలితాల అనంతరం విష్ణుతో కలిసి నరేశ్‌ మీడియా ముందుకు వచ్చాడు. దాస‌రి స్థానాన్ని భర్త చేసే ఆర్హత మోహన్‌ బాబు కి ఉందని, ఒకవేళ దాసరి గారు ఉన్నప్పటికి ఈ రోజు మోహన్‌ బాబుకు ఆ బాధ్యతలు ఇచ్చేవారన్నాడు. ఇండస్ట్రీలో చిరంజీవి మాత్రమే కాదని ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారన్నాడు.