Nagababu : గరికపాటి రచ్చ.! ఎట్టకేలకు నాగబాబు ‘మూడ్’ మారింది.!

NQ Staff - October 7, 2022 / 07:21 PM IST

Nagababu : గరికపాటి రచ్చ.! ఎట్టకేలకు నాగబాబు ‘మూడ్’ మారింది.!

Nagababu : ప్రవచనకారుడు గరికపాటి నరసింహరావు విషయంలో మెగాబ్రదర్ నాగబాబు ఒకింత నొచ్చుకున్నారు. తన అన్నయ్య చిరంజీవిని ఎవరో తూలనాడితే, నాగబాబుకి కోపం రావడంలో తప్పేమీ లేదు. కాకపోతే, ‘ఏపాటి వాడైనా..’ అంటూ నాగబాబు ట్వీటేయడం.. అదీ గరికపాటిని ఉద్దేశించి కావడంతో.. గరికపాటి అభిమానులు నొచ్చుకున్నారు.

బ్రాహ్మణ సంఘాలు రంగంలోకి దిగాయి. చిత్రంగా కాపు సంఘాలేవీ చిరంజీవికి బాసటగా నిలవలేదనుకోండి.. అది వేరే సంగతి. వాస్తవానికి చిరంజీవి కూడా ఆ విషయాన్ని లైట్ తీసుకున్నారు.

‘ఆయన స్థాయి అంతే..’ అని సరిపెట్టుకున్నారో.. లేదంటే, పండితుడు కదా.. అనవసర వివాదమెందుకని అనుకున్నారో.. కారణమేదైతేనేం, చిరంజీవి సంయమనం పాటించారు.

నాగబాబు ‘మూడ్’ మారడానికి కారణమేంటి..?

‘గరికపాటివారు ఏదో మూడ్‌లో అలా అని వుంటారు. ఆయన లాంటి పండితుడు అలా అని వుండకూడదని ఆయన అర్థం చేసుకోవాలని అన్నామే తప్ప, ఆయనతో క్షమాపణ చెప్పించుకోవాలని మాకు కోరిక లేదు..’ అంటూ నాగబాబు తాజాగా ట్వీటేశారు.

‘ఏదిఏమైనా మన మెగాభిమానులు ఆయనని అర్థం చేసుకోవాలిగానీ, ఆయనని ఎవరూ తప్పుగా మాట్లాడవద్దని మెగాభిమానులకు నా రిక్వెస్ట్..’ అంటూ నాగబాబు తన ట్వీటులో పేర్కొన్నారు.

కాగా, ‘ఏపాటి వాడికైనా చిరంజీవిగారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే..’ అంటూ నాగబాబు అంతకు ముందు ట్వీటేసిన సంగతి తెలిసిందే. ఇంతకీ, నాగబాబు మూడ్ ఎందుకు మారిందట.? ఏమో, ఆయనకే తెలియాలి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us