Varun Tej: వరుణ్ తేజ్ ప్రేమ వివాహాం.. నాగ బాబు రియాక్షన్ ఇదే!

Varun Tej మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో వేసే కౌంటర్ల గురించి అందరికీ తెలిసిందే. ని జీవితంలోనూ నాగబాబు ఎంతో సరదాగా ఉంటారు. కుటుంబ సభ్యులందరూ ఒకే చోట చేరితే నాగబాబు తెగ అల్లరి చేస్తూ అందరినీ నవ్విస్తుంటాడు. నాగబాబు తనపై వచ్చే ట్రోలింగ్‌ను సైతం తన స్టైల్లో తిప్పి కొడుతుంటాడు. నాగబాబు తన కుమారుడు వరుణ్ తేజ్ పెళ్లి గురించి తాజాగా కామెంట్ చేశాడు.

నిన్న నాగబాబు తన ఫాలోవర్లతో సోషల్ మీడియాలో ముచ్చటించాడు. ఈ క్రమంలో పలువురు నెటిజన్లు నాగబాబును రకరకాల ప్రశ్నలు అడిగారు. వాటికి నాగబాబు తన స్టైల్లో కౌంటర్లు ఇచ్చాడు. కొన్నింటికి సాధారణంగా ఆన్సర్స్ చెబితే.. ఇంకొన్నింటికి దిమ్మతిరిగిపోయే కౌంటర్లు వేశాడు. అలా వరుణ్ తేజ్ పెళ్లిపైనా స్పందించాడు.

Nagababu about Varun tej love marriage
Nagababu about Varun tej love marriage

వరుణ్ తేజ్ పెళ్లి ఎప్పుడు చేస్తారు? అని ఓ నెటిజన్ అడిగాడు. దానికి సమాధానంగా నాగబాబు.. మంచి సంబంధాలు ఉంటే చూడండి అంటూ రివర్స్ కౌంటర్ వేశాడు. ఇక మరో నెటిజన్ కూడా ఇదేక్రమంలో వరుణ్ తేజ్ పెళ్లి గురించి ప్రశ్నలు సంధించాడు. అయితే కాస్త వెరైటీ ప్రశ్న వేయడంతో నాగబాబు కౌంటర్ వేశాడు.

వరుణ్ తేజ్ ప్రేమ వివాహాం.. నాగ బాబు రియాక్షన్ ఇదే!

వరుణ్ ని ఒక మిడిల్ క్లాస్ గర్ల్.. తనే లైఫ్ అనుకుని వేరే థాట్ లేకుండా ఉంటే.. వరుణ్‌కి కూడా ఓకే అయితే మీరు ఏం అంటారు అని అడిగాడు. అంటే పరోక్షంగా ప్రేమిస్తే ఏం చేస్తారు అని అడిగేశాడు. దానికి నాగబాబు స్పందిస్తూ.. మీకు మీకు ఓకే అయితే నేనేమంటా? అంటూ ఓ కౌంటర్ వేసేశాడు.

Advertisement