Naga Vamsi: ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన నాగ వంశీ.. అభిమానులు ఖుష్
NQ Staff - February 11, 2022 / 01:40 PM IST

Naga Vamsi: యంగ్ టైగర్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనుంది. త్రివిక్రమ్ తో చేయాల్సిన ఈ సినిమా ఇప్పుడు కొరటాల దగ్గరకు వచ్చింది. అయితే కొన్ని రోజులుగా ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాపై సోషల్ మీడియాలో వార్తలు మరోలా వస్తున్నాయి. ఈ చిత్రం ఆగిపోయిందని.. మహేష్ బాబుతో ముందు సినిమా చేయడానికి త్రివిక్రమ్ సిద్ధమవుతున్నాడని ప్రచారం జరుగుతుంది.

Naga Vamsi Gives Clarity on NTR and Trivikram Srinivas Upcoming Movie
మరోవైపు తారక్ కూడా ఏం స్పందించకపోవడంతో ఇది నిజమే అని అభిమానులు కూడా నమ్మారు. అయితే ఇప్పుడు ఈ చిత్రంపై మరో అప్‌డేట్ కూడా బయటికి వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్‌తో అరవింద సమేత లాంటి సినిమా చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్.. 2020లో అల్లు అర్జున్‌తో అల వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చేసాడు. దాంతో ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో తారక్ కోసం కథ సిద్ధం చేస్తున్నాడు మాటల మాంత్రికుడు.
పాన్ ఇండియా సినిమాగా ప్లాన్ చేస్తున్నాడట త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ సినిమా మరి కొన్ని నెలలో సెట్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తుంది. భారీ స్కేల్‌లో సినిమాని ప్లాన్ చేస్తున్నారని నిర్మాత నాగవంశీ అన్నారు. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ పెద్ద స్కెచ్ వేశారట. చూడాలి మరిదీనిపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో.
ఎన్టీఆర్ 30వ చిత్రం కొరటాల శివతో కన్ఫర్మ్ అయ్యింది. త్వరలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. యూనివర్సల్ కాన్సెప్ట్ తో తన మార్కు సోషల్ మెసేజ్ జోడించి కొరటాల ఎన్టీఆర్ 30వ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం. అలియా భట్ హీరోయిన్ గా నటిస్తుండగా పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుంది.
అనూహ్యంగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుకు ఎన్టీఆర్ పచ్చ జెండా ఊపారనేది లేటెస్ట్ బజ్. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ మూవీలో ఎన్టీఆర్ కబడ్డీ ప్లేయర్ గా కనిపించనున్నారట. వచ్చే ఏడాది ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని వినికిడి. అలాగే పెద్ది అనే ఓ పవర్ ఫుల్ టైటిల్ అనుకుంటున్నారట.