Naga Shaurya : నాగ శౌర్యకి ఝలక్.! బ్రహ్మాణులైతే వేరేలా నడుస్తారా.?
NQ Staff - September 22, 2022 / 05:12 PM IST

Naga Shaurya : సినీ నటుడు నాగ శౌర్యకి ఝలక్ తగిలింది. ఈ మధ్య ప్రెస్ మీట్లలో సినీ జర్నలిస్టులు చిత్ర విచిత్రమైన ప్రశ్నలేస్తున్నారు. ఆయా ప్రశ్నల్లో కొన్ని ‘పెయిడ్ ప్రశ్నలు’ వుంటున్నాయ్. అవి వివాదాస్పద మవుతున్నాయ్. తద్వారా అవి ఆయా సినిమాల పబ్లిసిటీకి పనికొస్తున్నాయి.
‘డీజే టిల్లు’ సినిమా విషయంలో హీరోయిన్ల పుట్టమచ్చలపై వచ్చిన ప్రశ్న కావొచ్చు, ‘శాకిని డాకిని’ సినిమా సమయంలో హీరోయిన్ రెజినాకి సంధించిన ‘ఓసీడీ’ ప్రశ్న కావొచ్చు.. ఇలాంటివన్నీ పెయిడ్ వివాదాస్పద ప్రశ్నలే అనుకోవాలా.?
నాగ శౌర్య బ్రాహ్మణ నడక.!

Naga Shaurya was shocked By Questions Asked By Media Reporter
‘సమర సింహా రెడ్డి’ సినిమాలో హీరోకి ఓ దర్పం వుంటుంది. ‘జస్టిస్ చౌదరి’ సినిమాలో హీరోకి ఇంకో దర్పం వుంటుంది. రెడ్డి అంటే వేరే మనిషి అనుకోవాలా.? చౌదరి అంటే వేరే మనిషి అనుకోవాలా.? అన్న ప్రశ్న వస్తే ఏం చేయగలం.?
సినిమాల్లో బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా హీరో నటించాల్సి వస్తే, యాస దగ్గర్నుంచి, కట్టూ బొట్టూ వరకూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అది గతంలోనూ వుంది, ఇప్పుడూ వుంది. అదే చెబుతూ, ‘అవసరాల శ్రీనివాస్ నుంచి కొన్ని నేర్చుకున్నాను..’ అని నాగ శౌర్య చెప్పాడు.
అంతే, ‘బ్రాహ్మణులకు వేరే నడక వుంటుందా.? నేనూ మీలాగే నడుస్తాను కదా.?’ అని ఓ జర్నలిస్టు ప్రశ్నించాడు. సమాధానం చెప్పడానికి నాగ శౌర్య ఇబ్బంది పడ్డాడు. గతంలో స్వర్గీయ ఎన్టీయార్‌కి కూడా ఇలాంటి ప్రశ్నే ఎదురయ్యిందని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు ఈ యంగ్ హీరో.