Naga Chaithanya: స‌మంత ట్వీట్‌కి స్పందించిన చైతూ..దీంతో అయిన పుకార్ల‌కి బ్రేక్ ప‌డ్డ‌ట్టేనా?

Naga Chaithanya: ఇక ఆల్ హ్యాపీసే అనుకోవాలా.. కొద్ది రోజులుగా స‌మంత‌- నాగ చైతన్య బంధం గురించి సోష‌ల్ మీడియాలో ఎన్ని ర‌కాల వార్త‌లు పుట్టుకొస్తున్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇద్ద‌రు విడిపోతున్నార‌ని వారి బంధానికి త్వ‌ర‌లోనే పులిస్టాప్ ప‌డ‌నుందంటూ ప్ర‌చారాలు చేశారు. ఎన్నిప్ర‌చారాలు జ‌రిగినా కూడా ఇద్ద‌రిలో ఒక్క‌రు కూడా స్పందించ‌లేదు. దీంతో ఎవ‌రికి వారు క‌ట్టుక‌థ‌లు అల్లేసుకున్నారు.

Naga Chaithanya Say Thanks to Samantha
Naga Chaithanya Say Thanks to Samantha

అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జోడిగా ‘లవ్‌ స్టోరీ’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ బ్యూటిఫుల్‌ లవ్‌ స్టోరీకి సంబంధించిన ట్రైల‌ర్ తాజాగా విడుద‌లైంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు సినిమా ట్రైలర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమా కచ్చితంగా హిట్‌ అని కామెంట్లు పెట్టారు.స‌మంత కామెంట్ చేయ‌డం ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంది.

నాగ చైతన్య ట్విట్టర్ లో లవ్ స్టోరీ ట్రైలర్ పోస్ట్ చేయగా.. దానిని కోట్ చేస్తూ సామ్ స్పందించింది. ట్రైలర్ పై సామ్ ‘విన్నర్’ అని కామెంట్ పెట్టింది. చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపింది. ఈ పోస్ట్‌కి నాగ చైత‌న్య థ్యాంక్స్ సామ్ అని రిప్లై ఇచ్చాడు. దీనిని బ‌ట్టి చూస్తుంటే ఈ ఇద్ద‌రి మ‌ధ్య ఎలాంటి విభేదాలు లేవ‌ని, ఇద్దరు హ్యాపీగానే ఉన్న‌ట్టు తెలుస్తుంది. కేవ‌లం గాసిప్ రాయుళ్లు మాత్ర‌మే క‌ట్టు క‌థ‌లు అల్లుతున్నారని అర్ధ‌మ‌వుతుంది.

స‌మంత‌- నాగ చైత‌న్య వ్య‌వ‌హారం ఇండ‌స్ట్రీలో చ‌ర్చనీయాంశంగా మార‌గా, ఫ్యామిలీ కోర్టు వరకు వీరి వ్యవహారం ఎక్కిందని, కుటుంబ సభ్యులు సర్దిచెప్పేందుకు ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే సమంత ఇప్పుడు ఒంటరిగా ముంబైలో ఉండేందుకు ఫిక్స్ అయిందని కూడా పుకార్లు పుట్టుకొచ్చాయి. ఏది ఎలా ఉన్నా ల‌వ్ స్టోరీ ప్రమోష‌న్స్‌లో నాగ చైత‌న్య ఈ పుకార్ల‌పై పూర్తి క్లారిటీ ఇవ్వ‌నున్నాడు.