Naga Chaithanya: ప‌ర్స‌న‌ల్ లైఫ్ విష‌యాలు అడ‌గొద్దని మీడియాకి కండీష‌న్ పెట్టిన చైతూ..!

Naga Chaithanya: కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో నాగ చైత‌న్య‌- స‌మంత ప‌ర్స‌న‌ల్ లైఫ్‌కి సంబంధించి ఎన్నో పుకార్లు షికారు చేస్తున్నాయి. వీటిపై స‌మంత కాని చై కాని స్పందించ‌క‌పోయే స‌రికి అవి పెరుగుతున్నాయే త‌ప్ప పుల్ స్టాప్ ప‌డ‌డం లేదు. నాగ చైత‌న్య న‌టించిన ల‌వ్ స్టోరీ చిత్రం సెప్టెంబ‌ర్ 24న విడుద‌ల కానుండ‌గా, ఈ సినిమా ప్ర‌మోష‌న్‌లో చైతూ త‌మ‌పై వ‌చ్చే పుకార్ల‌కి క్లారిటీ ఇస్తాడ‌ని అంతా అనుకున్నారు.

Naga Chaithanya Restrictions to media on his Personal Life
Naga Chaithanya Restrictions to media on his Personal Life

కాని తాజా స‌మాచారం ప్ర‌కారం ల‌వ్ స్టోరీ ప్ర‌మోష‌న్స్‌లో ఎవ‌రు కూడా ప‌ర్స‌న‌ల్ లైఫ్ విష‌యాలు అడ‌గ‌కూడ‌ద‌ని కండీష‌న్ పెట్టాడ‌ట‌. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కాని దీనికి సంబంధించిన వార్త సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే సామ్.. ప్రొఫైల్ నేమ్ లో ‘అక్కినేని’ తొలగించడం.. తన భర్త చైతూ కు సంబంధించిన ట్వీట్స్ కానీ.. ఫోటోలు కానీ పోస్ట్ చేయక పోవడంతో ఈ పుకార్లకు బలం చేకూరింది.

రీసెంట్‌గా ”లవ్ స్టోరీ” ట్రైలర్ పై స్పందించిన సమంత.. ఇందులో హీరోయిన్ ని ట్యాగ్ చేసి హీరో చైతన్య ను ప్రస్తావించకపోవడం చర్చనీయాంశంగా మారింది. తన భర్త చైతన్య గురించి ఏమీ ప్రస్తావించకపోవడం పై నెటిజన్స్ సందేహాలు చేస్తున్నారు. గతంలో చైతూ సినిమాల ట్రైలర్స్ కు సమంత కామెంట్స్ పెడుతూ ఉండేది. కానీ ఇప్పుడు భర్త గురించి ఒక్క మాట కూడా చెప్పకపోవడం ఆశ్చర్యం కలిగించింది.

ఇద్దరిలో ఏ ఒక్కరూ నోరు మెదపకపోవడం పట్ల ఈ వార్త నిజమే అని భావిస్తున్నారు ప్రేక్షకులు. పైగా వీరిద్దరూ మాట్లాడుకునేది సోషల్‌ మీడియాలోనేనా అని కామెంట్లు చేస్తున్నారు. జూలై 9 తర్వాత చైతన్యకు సంబంధించి సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎలాంటి పోస్ట్‌ చేయలేదు. చైతన్య కూడా అంతే! న్యూ ఈయర్‌ రోజున ఇద్దరి ఫోటోను షేర్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత చై–సామ్‌లకు సంబంధించి ఎలాంటి పోస్ట్‌ చై వాల్‌ మీద లేదు.ఇవ‌న్నీ పుకార్లకి బ‌లాన్ని చేకూరుస్తున్నాయి.