Naga chaitanya: స‌మంత‌తో ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంటుంద‌ని కామెంట్ చేసిన నాగ చైత‌న్య‌

Naga chaitanya: అక్కినేని నాగ చైత‌న్య త‌న తండ్రి నాగార్జున‌తో న‌టించిన తాజా చిత్రం బంగార్రాజు. ఈ మూవీ జ‌న‌వ‌రి 14న విడుద‌ల కాగా, మంచి విజ‌యం సాధించింది. అన్ని చోట్ల ఈ మూవీకి మంచి వ‌సూళ్లు రాబ‌డుతున్నాయి. అయితే ఈమూవీ ప్ర‌మోష‌న్‌లో భాగంగా నాగ చైత‌న్య ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలియ‌జేశారు. ఇన్నాళ్లు సమంత‌తో విడాకుల విష‌యంపై కూడా స్పందించిన చైతూ రీసెంట్‌గా ఓపెన్ అయ్యాడు.

Naga chaitanya stunning comments on samantha
Naga chaitanya stunning comments on samantha

అది ఇద్దరి మంచి కోసం తీసుకున్న డెసిషన్ అని చెప్పిన నాగ చైతన్య.. అక్కడ ఆమె సంతోషంగా ఉంది, ఇక్కడ నేను కూడా సంతోషంగా ఉన్నాను. పరిస్థితులను బట్టి ఇద్దరికీ బెస్ట్ డెసిషన్ ఇదేనని అనిపించిందని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇక మ‌రోవైపు ఓ బాలీవుడ్ మీడియాతో ర్యాపిర్ ఫైర్ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌గా, ఈ కార్య‌క్ర‌మంలో స్పందించారు.

యాంక‌ర్.. ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ఏ హీరోయిన్‌తో బాగుంటుంద‌ని ప్ర‌శ్నించ‌గా, దానికి స‌మంత అని సమాధానం ఇచ్చాడు. ఈ క్లిప్ ఇప్పుడు నెట్టింట తెగ హ‌ల్ చ‌ల్ చేస్తుంది. విడాకుల త‌ర్వాత స‌మంత గురించి చైతూ పాజిటివ్‌గా స్పందించ‌డం ఆయ‌న గొప్ప‌త‌నానికి నిద‌ర్శ‌నం అంటూ కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. ఇక అలియా, దీపికాతో స్క్రీన్ షేర్ చేసుకోవాల‌ని ఉంద‌ని కూడా మ‌న‌సులో మాట చెప్పాడు.

చైతూ, నాగ్ న‌టించిన బంగార్రాజు తొలి రోజున ఓవర్సీస్‌లో మోస్తారు వసూళ్లు కనిపించాయి. ప్రీమియర్ల ద్వారా 40k డాలర్లు వసూలు చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం సుమారు 8 కోట్ల రూపాయలు తొలి రోజున వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశ ముందా లేదా అనేది తొలివారాంతంతో తేలిపోతుంది.

Naga chaitanya stunning comments on samantha1
Naga chaitanya stunning comments on samantha1

బంగార్రాజు చిత్రంలో నాగచైతన్య.. నాగార్జున మనవడిగా కన్పించ‌డు. నాగచైతన్య, కృతి శెట్టిలను కలపడానికి నాగార్జున, రమ్యకృష్ణ చేసే ప్రయత్నాలు హైలెట్ గా ఉన్నాయి. నాగచైతన్య కూడా వాసివాడి తస్సాదియ్యా అనే డైలాగ్ మేనరిజంతో అదుర్స్ అన్పించాడు.