Naga Chaitanya : స‌మంత నుండి విడిపోయిన త‌ర్వాత తొలి సారి ఆస‌క్తిక‌ర పోస్ట్ పెట్టిన నాగ చైత‌న్య‌

Naga Chaitanya : నాగ చైతన్య‌- స‌మంత విడిపోవ‌డం అభిమానుల‌ని ఎంత‌గా నిరాశ‌ప‌ర‌చిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అక్టోబ‌ర్ 2న విడిపోయిన వారిద్ద‌రు తమ వృత్తిపరమైన జీవితాల్లో బిజీగా గడుపుతున్నారు. ఇందులో భాగంగానే వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే లవ్‌ స్టోరీ చిత్రంతో నాగ చైతన్య సూపర్‌ హిట్‌ను అందుకున్న విషయం తెలిసిందే.

TheNewsQube-
Naga Chaitanya Social media post goes viral
Naga Chaitanya Social media post goes viral

స‌మంత శాకుంత‌లం సినిమాతో బిజీగా ఉండ‌గా, ఈ సినిమా త్వ‌ర‌లోనే విడుద‌ల కాబోతుంది. విడాకుల తాలూకు బాధను మర్చిపోవడానికే ఇలా వరుస సినిమాలతో బిజీగా మారుతున్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే విడాకుల నిర్ణయం ప్రకటించినప్పటి నుంచి సమంత ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంది సమంత.

Naga Chaitanya Social media post goes viral
Naga Chaitanya Social media post goes viral

తన భావాలను వ్యక్తపరిచేలా రకరకాల కొటేషన్స్‌ పోస్ట్‌ చేస్తూ వస్తోంది. అయితే తాజాగా నాగచైతన్య కూడా ఇలాంటి ఓ ఫోటోనే పోస్ట్ చేశాడు. సోషల్‌ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండని నాగచైతన్య తాజాగా చేసిన పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా నాగ చైతన్య బుక్‌ రీడింగ్‌ అలవాటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగానే మాథ్యూ మాక్కోనాగై అనే రచయిత రాసిన బుక్‌ను పూర్తి చేశాడు చై. ఈ విషయాన్ని ఇన్‌స్టావేదికగా షేర్‌ చేసిన నాగచైతన్య.. ‘జీవితానికి ఇదొక ప్రేమలేఖ.. మీ ప్రయాణాన్ని పంచుకున్నందుకు మాథ్యూకి కృతజ్ఞతలు. ఈ పుస్తకం నా జీవితానికి ఒక గ్రీన్‌ సిగ్నల్‌ లాంటిది’ అంటూ రాసుకొచ్చాడు.

నాగచైతన్య చేసిన ఈ పోస్ట్‌కి అర్థం ఏంటన్న దానిపై నెటిజన్లు కారణాలు వెతికే పనిలో పడ్డారు. ఇదిలా ఉంటే నాగచైతన్య ప్రస్తుతం తెలుగులో ‘థాంక్యూ’, ‘బంగార్రాజు’ చిత్రాలతో పాటు బాలీవుడ్‌లోనూ ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఇక వీటితో పాటు అమెజాన్‌ ఓటీటీలో రిలీజ్‌ కానున్న ఓ వెబ్‌ సిరీస్‌లోనూ చై నటిస్తున్నాడు. చైతన్య ఇందులో తొలిసారి నెగిటివ్‌ షేడ్స్‌లో న‌టిస్తున్నాడు.