Samantha సమంత నాగ చైతన్యలు ఫన్నీగా ముచ్చట్లుపెట్టిన సందర్భాలు కనిపించడం చాలా అరుదు. ఎందుకంటే నాగ చైతన్య కనిపిస్తే తెరమీద సినిమాల్లో లేదంటే బుల్లితెర పై యాడ్స్‌లో తప్పా మరెక్కడా కూడా కనిపించడు. నాగ చైతన్యకు సోషల్ మీడియాలో అంటే పడదు. ఏద సమయం సందర్భాన్ని బట్టి ఒకటి అలా పోస్ట్‌లు పెడుతుంటాడు. తన సినిమా అప్డేట్లు, పండుగలకు అభిమానులకు విషెస్ చెప్పడానికి తప్ప మరో విషయానికి సోషల్ మీడియాను వాడడు.
అలాంటి నాగ చైతన్య సమంత సామ్ జామ్ షోకి గెస్ట్‌గా వచ్చాడు. అయితే అక్కడ నాగ చైతన్య మాత్రం సమంతను దడదడలాడించాడు. వరుసగా పంచ్‌లు వేస్తూ సమంత గాలిని తీసేశాడు. ఇంట్లో సమంత చేసే పనులు, ఆమె వ్యవహారం అన్నింటిని బట్టబయలు చేసేశాడు. ఇంట్లో అసలు వంట వండటం, ఇంటిని శుభ్రంగా ఉంచడం వంటి పనులేవీ రావని చేయదని చెప్పేశాడు. ఇంట్లో ఘోరమైన భాష మాట్లాడుతుందని, తమిళం, తెలుగు, ఇంగ్లీష్ అన్ని కలిపి వాడేస్తుందని అన్నాడు.

అయితే నటిగా మాత్రం పదికి పది మార్కులు ఇచ్చేశాడు. నాగ చైతన్యను తన ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరు ఒక్కో ప్రశ్నను అడిగారు. అలా సుమంత్ ఓ డిఫరెంట్ ప్రశ్నను అడిగాడు. ఒక వేళ కారుగా మారితే ఏ కారులా మారతావ్? అని ప్రశ్నించాడు. మామూలుగా నాగ చైతన్యకు రైడింగ్‌లంటే ఇష్టం.. కార్లు, బైకులంటే మహా ప్రాణం. కాబట్టి ఈజీగానే సమాధానం చెప్పేశాడు. ఫెర్రారీ కారులా మారిపోతానని నాగ చైతన్య చెప్పేశాడు.
నాగ చైతన్య మాటలకు సమంత.. Samantha
అదే సమయంలో సమంత కూడా ఓ ప్రశ్నను అడిగేసింది. కారులా కాకుండా అసలు ఏ జీవి నీతో లేకపోతే నువ్ ఉండలేవు.. అని అడిగింది. దానికి వెంటనే చైతన్య సమాధానంగా హష్ పేరున చెప్పేశాడు. హష్ అంటే సమంత చైతన్యల పెంపుడు కుక్క. అలా హష్ పేరు చెప్పడంతో సమంత హర్ట్ అయింది. మరి నేను కాదా? అని అడిగింది. అలా ఎన్ని సార్లు అడిగినా కూడా చైతన్య హష్ పేరును చెప్పేశాడు. అలా చెప్పడంతో సమంత షాక్ అయిపోయింది. అంటే హష్ లేకపోతే నాగ చైతన్య ఉండలేడు. సమంత కంటే ఎక్కువగా హష్ అంటేనే ఇష్టమన్నమాట.