Naga Chaitanya : నాగచైత‌న్య ఏంటి ఇలాంటి నిర్ణ‌యం తీసుకున్నాడు… ఎవ‌రు చేయ‌ని పాత్ర చేస్తున్నాడుగా..!

Naga Chaitanya : అక్కినేని హీరో నాగ చైత‌న్య ప్ర‌స్తుతం ప‌లు చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు. ఆయ‌న రీసెంట్‌గా ల‌వ్ స్టోరీ చిత్రంతో ప్రేక్ష‌కుల ముంద‌కు వ‌చ్చి మంచి విజ‌యం సాధించాడు. ప్ర‌స్తుతం విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో ‘థ్యాంక్యూ’ అనే సినిమాను మొదలు పెట్టేశాడు. ఇది ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుతున్నారు.

Naga Chaitanya OTT entry with different role
Naga Chaitanya OTT entry with different role

హిందీలో ఆమిర్ ఖాన్ హీరోగా నటిస్తోన్న ‘లాల్ సింగ్ చద్దా’ అనే చిత్రంలోనూ కీలక పాత్రను చేస్తున్నాడు. ఇందులో దాదాపు 20 నిమిషాల పాటు ఉండే ఓ తెలుగు కుర్రాడి పాత్రను పోషిస్తున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్‌ను కూడా అతడు పూర్తి చేసేశాడు. ప్రస్తుతం నాగ చైతన్య నటిస్తోన్న చిత్రాల్లో ‘బంగార్రాజు’ ఒకటి. ఇందులో అక్కినేని నాగార్జున కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.

Naga Chaitanya OTT entry with different role
Naga Chaitanya OTT entry with different role

కల్యాణ్ కృష్ణ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ ‘సోగ్గాడే చిన్ని నాయన’కు ప్రీక్వెల్‌గా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఇది పలు షెడ్యూళ్లను కూడా కంప్లీట్ చేసేసుకుంది. ఇందులో నాగ చైతన్య టైటిల్ రోల్ చేస్తున్నాడు. ఈ మూవీలో అతడికి జోడీగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటిస్తోంది. ఇక, ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసుకుని వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది.

చైతూ ఓటీటీ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇక, క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సిరీస్‌లో నాగ చైతన్య పాత్ర ఎంతో కొత్తగా ఉండబోతుందని తెలిసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా అతడి రోల్ గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ వెబ్ సిరీస్‌లో అక్కినేని నాగ చైతన్య క్రూరమైన విలన్ పాత్రను చేస్తున్నాడట. ఒకరకంగా ఇది సైకోను పోలి ఉంటుందని అంటున్నారు.

హీరోగా సత్తా చాటుతోన్న అతడు.. ఇప్పుడీ ప్రయోగం చేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాడనే టాక్ వినిపిస్తోంది. ఇక, ఇందులో అతడికి జోడీ ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తోందని సమాచారం. ఈ క్రైమ్ హర్రర్ వెబ్ సిరీస్‌ను విక్రమ్ కే కుమార్‌ తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయని ఫిలిం నగర్ ఏరియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.