Naga Chaitanya : అఖిల్ కాకుండా చైతూకి ఉన్న మ‌రో త‌మ్ముడు ఎవ‌రో తెలుసా?

Naga Chaitanya : అక్కినేని నాగ చైత‌న్య సోషల్ మీడియాలో పెద్ద‌గా యాక్టివ్‌గా ఉండ‌రు. అయితే ఆయ‌న గురించి ఇటీవ‌ల తెగ వార్త‌లు వ‌స్తున్నాయి. స‌మంత నుండి విడిపోయిన త‌ర్వాత చైతూ హాట్ టాపిక్‌గా మారాడు. తాజాగా నాగ చైతన్యకు ఎంతమంది తమ్ముళ్లు ఉన్నారు..అనే విష‌యం హ‌ట్ టాపిక్‌గా న‌డుస్తుంది.

Naga Chaitanya has one more brother 2
Naga Chaitanya has one more brother

అందరికీ తెలిసిన నిజం ఏంటంటే చైతూకి అఖిల్ ఒక్కడే తమ్ముడు ఉన్నాడ‌ని. కాని మ‌రో త‌మ్ముడు కూడా చైతూకి ఉన్న‌ట్టు తెలుస్తుంది. అక్కినేని వంశం కాదు కానీ చైతూకు మరో తమ్ముడు కూడా ఉన్నాడు. సోషల్ మీడియాలో దీని గురించి ఇప్పుడు చర్చ కూడా బాగానే నడుస్తుంది. చైతూ అమ్మగారు లక్ష్మితో ఒకప్పుడు నాగార్జున పెళ్లి జరిగింది.

Naga Chaitanya has one more brother
Naga Chaitanya has one more brother

రామానాయుడు కూతురు అయిన లక్ష్మిని పెళ్లి చేసుకున్న నాగార్జున.. కొన్నేళ్ల తర్వాత విడాకులు ఇచ్చాడు. ఇద్దరి మధ్య మనస్పర్థల కారణంగా విడిపోయారే కానీ ఈ రెండు కుటుంబాల మధ్య రిలేషన్ మాత్రం ఇప్పటికీ అలాగే ఉంది. ఇంట్లో వేడుక జరిగినా కూడా రెండు కుటుంబాలు కలిసి వేడుక చేసుకుంటాయి. అంతేకాదు నాగార్జున, వెంకటేష్ కూడా అంతే స్నేహంగా కనిపిస్తుంటారు.

ల‌క్ష్మి .. చెన్నైలో ఉన్న బిజినెస్ మ్యాన్ శరత్ విజయరాఘవన్‌ని పెళ్లి చేసుకున్నారు . పెళ్లి త‌ర్వాత చైతూ తండ్రి ద‌గ్గ‌రే ఎక్కువ‌గా ఉంటున్నాడు. కొన్నేళ్ల కింద లక్ష్మి, శరత్ కొడుకు పెళ్లి ఘనంగా చెన్నైలో జరిగింది. ఈ పెళ్ళికి చైతు, సామ్ కూడా హాజరయ్యారు. తమ్ముడి పెళ్లికి వెళ్లి మనస్పూర్థిగా ఆలోచించాడు చైతన్య.

మరోవైపు చైతూతో విడాకులకు ముందు తన అత్తయ్య అంటే సమంతకు చాలా గౌరవం. ఆమె ఎంతో వ్యక్తిత్వం ఉన్న మనిషి అంటుంది సమంత. ఏదేమైనా కూడా అఖిల్ కాకుండా నాగ చైతన్యకు మరో తమ్ముడు కూడా ఉన్నాడన్నమాట. ఆయనకు సినిమాలకు అస్సలు సంబంధం లేదు.