Naga Chaitanya : స‌మంత మాదిరిగానే చైతూ కూడా ఫుల్ బిజీ.. అక్కినేని హీరో చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయో తెలుసా?

Naga Chaitanya : టాలీవుడ్ క్రేజీ క‌పుల్‌గా ఉన్న ఈ జంట అక్టోబ‌ర్ 2న విడాకులు తీసుకొని అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. సామ్- చై విడిపోవ‌డంతో అంద‌రు షాక్ అయ్యారు. అయితే విడాకుల త‌ర్వాత ఇద్ద‌రు పాత జ్ఞాప‌కాలు మ‌ర‌చిపోయేందుకు వ‌రుస సినిమాల‌తో బిజీ అయ్యారు.సామ్ గత కొద్ది రోజులుగా తన పర్సనల్ విషయాలతో పాటు.. కొన్ని మోటీవేటివ్ కోట్స్ నెట్టింట్లో షేర్ చేస్తుంది. ఇక సామ్ ఇప్పుడు సినిమాల పరంగా దూసుకుపోతుంది.

Naga Chaitanya full busy like Samantha
Naga Chaitanya full busy like Samantha

వరుస ప్రాజెక్ట్స్‏కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది. వివాహం తర్వాత సామ్ సినిమాల ఎంపిక పూర్తిగా మారిపోయింది. ఉమెన్ ఒరియేంటెడ్ మూవీస్ చేస్తూ.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కేవలం వెండితెరపైనే కాకుండా.. డిజిటల్ ప్లాట్ ఫాంలోనూ సమంత తన సత్తా చాటుకుంది. సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ చేస్తూ సూపర్ హిట్స్ అందుకుంది. సినిమాలు స్పెష‌ల్ సాంగ్స్‌తో నానా ర‌చ్చ చేస్తుంది.

Naga Chaitanya full busy like Samantha
Naga Chaitanya full busy like Samantha

ఇక అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య ఇటీవలే లవ్ స్టోరీ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ప్రేమమ్ సినిమాతర్వాత చైతన్య కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు వహిస్తున్నారు. ఆచితూచి కథలను ఎంచుకుంటూ విజయాలను అందుకుంటున్నాడు ఈ కుర్ర హీరో.

ప్ర‌స్తుతం విక్రమ్ కుమార్ కె దర్శకత్వంలో థ్యాంక్యూ సినిమా చేస్తున్నాడు చైతు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో హాకీ ప్లేయర్ గా కనిపించనున్నాడు చైతన్య. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ లో కూడా అడుగుపెడుతున్నాడు ఈ అక్కినేని యంగ్ హీరో. స్టార్ హీరో అమీర్ ఖాన్ నటిస్తున్న లాల్ సింగ్ చద్దా సినిమాలో కీలక పాత్ర‌లో కనిపించనున్నాడు.

ఇప్పటికే ఈసినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో ఆర్మీ పర్సన్ గా కనిపించనున్నాడు చైతూ. ఇక కింగ్ నాగార్జున నటిస్తున్న బంగార్రాజు సినిమాలో నటిస్తున్నాడు చైతన్య. ఈ సినిమాలో నాగార్జున కొడుకు పాత్రలో కనిపించనున్నాడు. వీటితో పాటు ఓ వెబ్ సిరీస్ లో కూడా చైతన్య నటిస్తున్నట్టు తెలుస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో నిర్మించే సిరీస్ కి విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వెబ్ సిరీస్ హారర్ నేపథ్యంలో ఉండనుందట . చూస్తుంటే స‌మంత మాదిరిగా చైతూ కూడా చాలా బిజీగానే ఉన్న‌ట్టు తెలుస్తుంది.