Naga chaitanya: బంగార్రాజు నుండి నాగ చైతన్య ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌..లుక్ అదిరిపోయిందిగా..!

Naga chaitanya: అక్కినేని నాగ చైతన్య స్లో అండ్ స్ట‌డీగా ముందుకు సాగుతున్నాడు. హిట్ , ఫ్లాపుల‌తో దోబూచులాడుతూ ప్రేక్ష‌కులని ఫుల్‌గా ఎంట‌ర్‌టైన్ చేస్తూనే ఉన్నాడు. అయితే హీరో నాగ చైతన్య ఇటీవ‌ల సమంత నుండి విడిపోతున్నట్లు ప్రకటించి అంద‌రిని షాక్ లోకి నెట్టారు. అయితే స‌మంత కాస్త ఎక్కువగా తన స్నేహితులతో విహారయాత్రలు చేస్తూ ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగిస్తోంది.

naga chaitanya first look
naga chaitanya first look

అంతేకాకుండా ఆమె సినీ జీవితంలో కూడా కొన్ని మార్పులు చోటు చేసుకునే విధంగా అడుగులు వేస్తున్నట్లు అర్థమవుతోంది. ఇటీవల పుష్ప సినిమాలో స్పెషల్ ఐటమ్ సాంగ్ చేసేందుకు కూడా డిసైడ్ అయింది. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఆమెకు భారీ ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. నాగచైతన్య మాత్రం షూటింగ్స్ తప్పితే మరే విధమైన ప్రోగ్రాఅయ‌మ్స్ కూడా పెట్టుకోవడం లేదు కదా.

నాగ చైత‌న్య కూడా వ‌రుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆయ‌న ప్రస్తుతం నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం బంగార్రాజులో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. గతంలో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు సీక్వెల్‏గా తెరకెక్కుతుంది ఈ మూవీ. బంగార్రాజు చిత్రానికి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో అక్కినేని నాగచైతన్య, ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి కీలక పాత్రలలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

నవంబర్ 23న నాగచైతన్య పుట్టినరోజు.. ఈ సందర్భంగా అభిమానులకు రెండు సర్ప్రైజ్ ఇవ్వనున్నారు. తాజ‌గా చైతూ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. ఇంద‌లో కర్ర‌ను ప‌ట్టుకొని ద‌స‌రా బుల్లోడు లుక్‌లో క‌నిపిస్తున్నాడు నాగ చైత‌న్చ‌య‌. ఇక రేపు చైతూకి సంబంధించిన టీజ‌ర్ విడుద‌ల చేయ‌నున్నారు. ఆయ‌న మిగతా సినిమాల‌కు సంబంధించిన స‌ర్‌ప్రైజెస్ కూడా రాబోతున్నాయి.

విక్రమ్ కుమార్ తో థాంక్యూ సినిమాతో పాటు ఒక హారర్ త్రిల్లర్ జానర్ లో వెబ్ మూవీ చేయనున్నాడు చైతూ. ఇక అమీర్ ఖాన్ యొక్క లాల్ సింగ్ చద్దా సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.