Naga Chaitanya : నాగార్జున, టబు లవ్ ఎఫైర్ వార్తలపై స్పందించిన చైతూ.. అది నిజమే అంటూ..!
NQ Staff - June 4, 2023 / 05:49 PM IST

Naga Chaitanya : సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత హీరో, హీరోయిన్ల నడుమ ఏదో ఒక లవ్ ఎఫైర్ వార్తలు కామన్ అయిపోయాయి. అయితే సీనియర్ హీరో నాగార్జున, టబు మధ్య కూడా లవ్ ఎఫైర్ ఉందంటూ అప్పట్లో జోరుగా వార్తలు వచ్చాయి. కానీ వాటిపై ఇప్పటి వరకు అటు టబు గానీ, నాగార్జున గానీ స్పందించలేదు. వీరిద్దరూ కలిసి నిన్నే పెళ్లాడతా సినిమాలో నటించారు.
ఆ మూవీ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారంట. అయితే ఈ మూవీ షూటింగ్ సందర్భంగా నాగార్జున, టబు, అమల ఓ ఫొటో దిగారు. దాంతో వారి ప్రేమ విషయం అమలకు తెలుసేమో అంటూ ఇప్పటికీ రూమర్లు వస్తూనే ఉన్నాయి. నాగార్జున కోసమే టబు పెండ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉండిపోయిందనే వాదన కూడా ఉంది.
అయితే తాజాగా ఈ వార్తలపై స్పందించాడు నాగచైతన్య. ఆయన మాట్లాడుతూ.. ఇండస్ట్రీ నుంచి మా కుటుంబానికి దగ్గరైన వ్యక్తి టబుగారు. ఆమె సినిమా హీరోయిన్ గా కాకుండా మా సొంత కుటుంబ సభ్యురాలిగా మాతో కలిసిపోతుంది. నా చిన్న వయసులో ఎన్నోసార్లు ఆమె మా ఇంటికి వచ్చింది. ఇప్పటికీ పండుగలకు విషెస్ చెబుతూనే ఉంటుంది అంటూ తెలిపాడు చైతూ.
అంతే తప్ప తన తండ్రికి, టబుకు మధ్య ఎఫైర్ వార్తలను మాత్రం ఖండించలేదు. దాంతో అనుమానాలు మరింత పెరిగాయి. ఒకవేళ ఏమీ లేకపోతే ఆ వార్తలను ఖండించేవాడు కదా.. రిలేషన్ ఉంది అంటే అది లవ్ రిలేషనే కావచ్చేమో అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా చైతూ అనేక అనుమానాలు మిగిల్చాడు.