Naga Chaitanya : నాగచైతన్య NC22 టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్
NQ Staff - November 23, 2022 / 10:57 AM IST

Naga Chaitanya : నాగ చైతన్య మొదటి సారి తెలుగు మరియు తమిళంలో చేస్తున్న సినిమా యొక్క టైటిల్ ని ప్రకటించారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా యొక్క టైటిల్ నాగ చైతన్య పుట్టిన రోజు సందర్భంగా రివిల్ చేశారు.
ఇన్ని రోజులు NC22 అంటూ ప్రచారం జరిగిన ఈ సినిమా యొక్క టైటిల్ కస్టడీ అని కన్ఫమ్ చేశారు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా ను వెంకట్ ప్రభు తమిళం మరియు తెలుగులో ఏక కాలంలో రూపొందిస్తున్నారు.
కొన్ని సన్నివేశాల కోసం ప్రత్యేక నటీనటులను మరియు సన్నివేశాలను వేరు వేరుగా తెలుగు మరియు తమిళం భాషల కోసం రూపొందిస్తున్నారని సమాచారం అందుతుంది. నాగ చైతన్య ఈ సినిమాలో విభిన్నంగా కనిపిస్తాడని మొదటి నుండే ప్రచారం జరుగుతుంది.
ఈ సినిమా తో నాగ చైతన్య కి తమిళనాడు లో మంచి గుర్తింపు వస్తుందని నమ్మకాన్ని వెంకట్ ప్రభువు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా కు సంబంధించిన చివరి దశ షూటింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయని వచ్చే సంవత్సరం సమ్మర్ కానుక వేసిన మన ప్రేక్షకులకు తీసుకు వచ్చే విధంగా దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది.
ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తున్న విషయం తెలిసిందే. కస్టడీ టైటిల్ తెలుగు మరియు తమిళ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఉంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. నాగచైతన్య మరియు కృతి శెట్టి గతంలో బంగార్రాజు సినిమాలో నటించారు. ఇప్పుడు ఈ సినిమా తో మరోసారి జోడి కట్టబోతున్నారు.
Let’s be the change we want to see in the world! Happy bday bro @chay_akkineni let the hunt begin! #Custody #AvenkatPrabhuHunt @SS_Screens @ilaiyaraaja @thisisysr @srkathiir @thearvindswami @IamKrithiShetty @realsarathkumar @rajeevan69 #vp11 pic.twitter.com/ELhxOkfuci
— venkat prabhu (@vp_offl) November 23, 2022