Naga Babu : ఆ బడా హీరో కూతురుతో వరుణ్ తేజ్ పెండ్లి.. అంతా సెట్ చేస్తున్న నాగబాబు..?
NQ Staff - January 21, 2023 / 11:54 AM IST

Naga Babu : మెగా ఫ్యామిలీకి ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది. ఎలాంటిబ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి చిరంజీవి మెగా సామ్రాజ్యాన్ని సృష్టిస్తే.. దాన్ని పవన్, బన్నీ, రామ్ చరణ్ లు పదింతలు చేశారు. ఇప్పుడు టాలీవుడ్ లోనే కాదు పాన్ ఇండియాలో వ్యాప్తంగా కూడా మెగా మేనియా నడుస్తోంది. ఇక ఇదే కుటుంబం నుంచి నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆయన కూడా మంచి సినిమాలు చేస్తూ టైర్-2 హీరోగా గుర్తింపు సాధించాడు.
నటుడిగా మంచి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు వరుణ్ తేజ్. ఇప్పటి వరకు ఎలాంటి వివాదాలకు పోకుండా సినిమాలపై దృష్టి పెడుతున్న వరుణ్ తేజ్ మీద రీసెంట్ గా ఓ రూమర్ వచ్చింది. ఆయన లావణ్య త్రిపాఠితో లవ్ లో ఉన్నాడంటూ వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే నాగబాబు కూడా వరుణ్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
పెద్ద సంబంధాలు..
అంతే కాకుండా త్వరలోనే వరుణ్ తేజ్‌కు పెండ్లి చేయాలని ఆలోచిస్తున్నాడంట నాగబాబు. ఇందుకోసం ఇప్పటికే చాలా పెద్ద పెద్ద సంబంధాలను లైన్ లో పెడుతున్నాడంట. అయితే తమ కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా ఉండే దగ్గుబాటి కుటుంబంతో వియ్యం అందుకోవాలని నాగబాబు ఆశిస్తున్నాడంట.

Naga Babu Wants Varun Tej To Marry Daggubati Younger Daughter
ఇందులో భాగంగానే వెంకటేశ్ చిన్న కూతురు హయవాహినితో వరుణ్ తేజ్ పెండ్లి చేయాలని అనుకుంటున్నాడంట. ఇప్పటికే ఇరు కుటుంబాలు దీనిపై చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. నాగబాబుకు కూడా వరుణ్ తేజ్ ఒక్కడే వారసుడు. కాబట్టి ఆయన ఆస్తి మొత్తం వరుణ్ కే దక్కుతుంది. పైగా మంచి హీరోగా ఉన్నాడు కాబట్టి వీరి పెండ్లి జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.