NAGA BABU: త‌న అల్లుడికి స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన నాగ‌బాబు.. ఆనందంలో ఉబ్బిత‌బ్బిబ్బ‌యిన నిహారిక‌

మెగా ఫ్యామిలీలో చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌ర్వాతి స్థానం ఎవ‌రిదంటే నాగబాబుదే అని చెప్ప‌వ‌చ్చు. హీరోగా సినిమాలు చేసి అల‌రించ‌లేక‌పోయిన కూడా అన్న‌, త‌మ్ముళ్లకు అన్ని విష‌యాల‌లో త‌న స‌పోర్ట్ అందిస్తూ వస్తున్నారు. మెగా బ్ర‌ద‌ర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగ‌బాబు ఆరెంజ్ సినిమా టైంలో చాలా ఇబ్బందులు ప‌డ‌గా, ఇప్పుడు ఆయ‌న జీవితం మూడు పువ్వులు ఆరు కాయ‌లు అన్న‌ట్టు సంతోషంగా న‌డుస్తుంది. గ‌త ఏడాది డిసెంబ‌ర్ 9న త‌న కూతురు నిహారిక‌ను జొన్న‌ల‌గ‌డ్డ చైత‌న్యకు ఇచ్చి వివాహం చేయ‌గా, వారిద్ద‌రు ఇప్పుడు అన్యోన్య‌మైన జీవితం గ‌డుపుతున్నారు.

నిహారిక అడ‌పాద‌డ‌పా త‌న సోష‌ల్ మీడియా ద్వారా అత్తింటి విష‌యాల‌ను సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేస్తూనే ఉంటుంది. త‌ల్లిగారింట్లో గారాబంగా పెరిగిన నిహారిక అత్తింట్లో కూడా అలానే ఉంటుంద‌ట‌. ఈ మ‌ధ్య త‌న కాలు ఫ్రాక్చ‌ర్ కాగా, ఆమెకు అన్ని స‌ప‌ర్య‌య‌లు త‌న భ‌ర్త చేసాడ‌ని సోష‌ల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చింది. మంచి అల్లుడు దొరికినందుకు నాగ‌బాబు ఫ్యామిలీ చాలా సంతోషిస్తున్నారు. అయితే నాగ‌బాబు- చైత‌న్య‌ పెళ్లి త‌ర్వాత వ‌చ్చిన పెద్ద పండుగ ఉగాది కావ‌డంతో ఆ పండుగ రోజు అల్లుడికి స‌ర్‌ప్రైజింగ్ గిఫ్ట్ ఇవ్వాల‌ని ప్లాన్ చేశాడు నాగ‌బాబు. కాని అనివార్య కార‌ణాల వ‌ల‌న కాస్త లేట్ అయింద‌ట‌.

అల్లుడు-కూతురికి 70 ల‌క్ష‌ల రేంజ్‌ రోవర్‌ డిస్కవర్‌ తెలుపు రంగు కారును బ‌హుమ‌తిగా ఇచ్చిన‌ట్టు నాగబాబు త‌న యూట్యూబ్ ఛానెల్ ద్వారా తెలియ‌జేశాడు. ఉగాదికి ఇవ్వాల‌ని అనుకున్నాను కాని అది కుద‌ర‌లేదు అని స్ప‌ష్టం చేశాడు. కొత్త కారుని చూసి నిహారిక‌- చైత‌న్య తెగ మురిసిపోయారు. ముఖ్యంగా నిహారిక సంతోషం ప‌ట్ట‌లేక త‌న తండ్రిని హ‌గ్ చేసుకొని ముద్దిచ్చింది. నిహారిక‌- చైత‌న్య జంట త్వ‌ర‌లో కొత్త కారులో లాంగ్ డ్రైవ్‌కు వెళ్ల‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఇక నిహారిక కెరీర్ విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు సినిమాల క‌న్నా వెబ్ సిరీస్‌ల‌పై ఎక్కువ దృష్టి సారిస్తుంది.

Advertisement