Naga Babu: త‌న రాజీనామా ప‌త్రాన్ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన నాగ‌బాబు

Naga Babu: మా ఎన్నిక‌ల హ‌డావిడి త‌గ్గినా కూడా విమ‌ర్శ‌లు ప్ర‌తి విమ‌ర్శ‌లు సాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు గెలిచిన వాళ్లు ఓడిన వాళ్ల‌పై, ఓడిన వాళ్లు గెలిచిన వాళ్ల‌ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మా అధ్య‌క్ష బ‌రిలో నిలిచిన ప్ర‌కాశ్ రాజ్‌కి నాగ‌బాబు మ‌ద్దతు ప్ర‌క‌టించిన పెద్ద నిరాశ‌నే మిగిల్చింది. దీంతో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో కొనసాగడం నాకు ఇష్టం లేక ‘మా’ అసోసియేషన్‌లో నా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను.. సెలవు’’ అని నాగబాబు ట్వీట్​ చేశారు.

Naga Babu Resignation Letter to MAA Membership
Naga Babu Resignation Letter to MAA Membership

ఇది తాను ఎంతగానో ఆలోచించి ప్రలోభాలకు అతీతంగా తీసుకున్న నిర్ణయమన్నారు. 48 గంటల్లో తన రాజీనామా లేఖను మా కార్యాలయానికి పంపిస్తానన్నారు. అన్న‌ట్టుగానే కొద్ది సేప‌టి క్రితం త‌న రిజైన్ లెట‌ర్ పోస్ట్ చేశారు. ప్రాంతీయ వాదం మరియు సంకుచిత మనస్తత్వం తో కొట్టు-మిట్టులాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో కొనసాగడం నాకు ఇష్టం లేక “మా” అసోసియేషన్లో “నా” ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను సెలవు. అని నాగబాబు తెలియ‌జేశారు.

మాలో నేను కొన‌సాగ‌లేక రిజైన్ చేస్తున్నాయి. ప్ర‌కాశ్ రాజ్ లాంటి వాళ్ల‌కు నా స‌పోర్ట్ ఎప్పుడు ఉంటుంది. నిష్పక్షపాత, విభిన్నత కలిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తీరును తాను ఎప్పుడూ అభిమానించేవాడని, సంస్కృతులు, ప్రాంతాలకు అతీతంగా కళాకారులను అక్కున చేర్చుకుని ‘మా’ ఒక సొంతిళ్లుగా నిలిచిందని అన్నారు.

తాను గతంలో ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో గతంలో పోటీ చేయడానికి ప్రధాన కారణం ఇదేనని తెలిపారు. కానీ, ఇటీవలి కాలంలో ‘మా’ సభ్యుల్లో అటు కళాకారులుగా ఇటు మనుషులుగా అనూహ్య మార్పులు వచ్చాయని, ఈ అసహ్యకరమైన మార్పులు ఆశ్చర్యానికి గురిచేశాయని వివరించారు.

ప్రాంతీయవాదం, సంకుచిత మనస్తత్వ ధోరణులతో సభ్యులు ఎంతగా మారిపోయారో ఈ ఎన్నికలు తన లాంటివారికి కనువిప్పు కలిగించాయని నాగబాబు తెలిపారు. బలగం, ధన ప్రభావంతో అసోసియేషన్ సభ్యులు దారుణంగా దిగజారిపోయారని ఆరోపించారు. ఇలాంటి హిపోక్రైట్స్, స్టీరియోటైప్ సభ్యుల కారణంగానే అసోసియేషన్ నుంచి తాను వైదొలగలాని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

ప్రాంతతత్వం, మతతత్వాలతో అసోసియేషన్ సొంత గోతి తవ్వుకుంటున్నదని, అందుకే గుడ్ బై చెప్పడం అనివార్యమైందని వివరించారు. గౌరవనీయులైన ప్రకాశ్ రాజ్ వెంట తాను ఎల్లప్పుడూ నిలబడే ఉంటారని నాగబాబు స్పష్టం చేశారు. ఆయన ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే సత్తా గల అచంచల వ్యక్తి అని ప్రకాశ్‌ రాజ్‌ను ప్రశంసించారు. అసోసియేష‌న్ భ‌విష్య‌త్‌పైన ఆందోళ‌న చెందుతున్నట్టుగా పేర్కొన్నారు.