Naga Babu : ‘వకీల్ సాబ్’ వర్సెస్ ‘సీఎం సాబ్’-5: సీఎం సాబ్ మంచోడే. కానీ..

Naga Babu : ‘వకీల్ సాబ్’ మూవీకి తీవ్ర అన్యాయం జరిగినా వాదించటానికి తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలు ఎవరూ ముందుకు రారేంటి? అని నిన్న శనివారం ఎల్లో మీడియా అడిగిన ప్రశ్నకి ఇవాళ ఆదివారం సమాధానం దొరికింది. ‘ఎస్.. నేనున్నా’’ అంటూ ‘వకీల్ సాబ్’ పిక్చర్ హీరో పవన్ కళ్యాణ్ చిన్నన్న నాగబాబు ముందుకు వచ్చారు. ఈ చిత్రానికి సంబంధించి ఏపీలోని కొన్ని ఏరియాల్లో బెనెఫిట్ షోలను నిలిపేయటం, టికెట్ల రేట్లను పెంచకుండా అడ్డుకోవటం గురించి ఆయన మాట్లాడారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి చెడ్డ పనులు చేసే వ్యక్తి కాదని తాను నమ్ముతున్నట్లు చెప్పారు.

naga-babu-pawan-kalyan-brother-reacts-on-rates-issue-of-vakeel-saab-movie-tickets
naga-babu-pawan-kalyan-brother-reacts-on-rates-issue-of-vakeel-saab-movie-tickets

మరి ఎవరు చేశారు?..

ఏపీ సీఎం జగన్ రాష్ట్ర పరిపాలనకు సంబంధించి ఎన్నో సమస్యలపై నిత్యం యుద్ధం చేస్తూ ఫుల్లు బిజీగా ఉంటారని నాగబాబు తెలిపారు. లోకల్ ఎమ్మెల్యేలు, ఇతర పొలిటికల్ లీడర్లు మాత్రమే ఇలాంటి చిల్లర వ్యవహారాలు చేసి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. వాస్తవానికి జగన్ కి గనక ఈ విషయం తెలిస్తే తప్పకుండా సానుకూలంగా స్పందించే ఛాన్స్ ఉందని విశ్వాసం వెలిబుచ్చారు. ‘‘పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా ఎంతగా విమర్శించినా ఓకే. కానీ ఇది ప్రొఫెషన్ కి సంబంధించి అంశం. ఇందులో ఇబ్బందులు పెడితే సినిమాపై ఆధారపడ్డ కార్మికులు, ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఇలా ఎన్నో కుటుంబాలు నష్టపోతాయి’’ అని నాగబాబు ఆవేదన చెందారు.

ప్రభుత్వ వివరణ: Naga Babu

పవన్ కళ్యాణ్ ని ‘వకీల్ సాబ్’ ఫిల్మ్ విషయంలో తామేమీ ఇబ్బందిపెట్టలేదని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఇవాళ ఆదివారం విశాఖలో స్పష్టం చేశారు. టికెట్ల రేట్ల పెంపుదలను నిలిపేసింది సామాన్యులను దృష్టిలో పెట్టుకొనే అని వివరణ ఇచ్చారు. అదే సమయంలో.. జనం చలన చిత్రాలను చూసి ఓట్లేయరని హితవు పలికారు. ‘వకీల్ సాబ్’ మూవీకి మొదటి మూడు రోజులు(9, 10, 11 తేదీల్లో) ఎగ్జిబిటర్లు నిర్ణయించిన రేట్లకే టికెట్లు అమ్ముకునేందుకు ఏపీ హైకోర్ట్ సింగిల్ జడ్జి ఆదేశాలు ఇవ్వగా వాటిని డివిజన్ బెంచ్ సవరించిన సంగతి తెలిసిందే. నిన్న శనివారం ఒక్క రోజే ఎక్కువ ధరకు విక్రయించొచ్చని, ఇవాళ్టి(ఆదివారం) నుంచి సర్కారు చెప్పిన రేట్లే అమలుచేయాలని ఆదేశించిన విషయమూ విధితమే.

Advertisement