Naga Babu: నాగ‌బాబు మా గొడ‌వ‌లు టీ క‌ప్పులో తుఫాను వంటివి

Naga Babu:మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల వ్యవహారం వేడి రాజుకుంటూనే ఉంది. ఎవ‌రో ఒకరు మా ఎన్నిక‌లకు సంబంధించి కామెంట్స్ చేయ‌డం, వారికి మ‌రొక‌రు కౌంట‌ర్ ఇస్తూ మా ఎన్నిక‌ల‌ను రక్తి క‌ట్టిస్తున్నారు. రీసెంట్‌గా బాల‌కృష్ణ స్పెష‌ల్ క్లాసుల‌లో అమెరికాకు వెళ్లి ఈవెంట్స్ చేస్తారు, ఆ డబ్బులేమైన‌ట్టు అని ప్ర‌శ్నించారు. మా అనేది చిన్న సంస్థ.. అధ్యక్ష పదవి కోసం ఇలా బయటకు రావడం, తిట్టుకోవడం, విమర్శలు చేసుకోవడం ఏమీ బాగాలేదంటూ చెప్పుకొచ్చారు.

మ‌రోవైపు మా ఎన్నిక‌లని ఏక‌గ్రీవం చేస్తే బాగుంటుంద‌ని ముర‌ళీ మోహ‌న్ అన‌గా, దానిపై నాగబాబు స్పందించారు. ఏక‌గ్రీవం అనేది త‌ప్పుడు ఆలోచ‌న‌. ఎన్నిక‌లు జ‌రిగితేనే స‌రైన నాయ‌కుడు ఎన్నుకోబ‌డ‌తాడు. శివాజీరాజా ప్రెసిడెంట్‌గా ఉండగా అమెరికాకు వెళ్లి ఓ ప్రోగ్రామ్‌ ద్వారా.. ‘మా’ అసోసియేషన్‌కు ఫండ్ సేకరించారు. వాటిని వెల్ఫేర్‌ కోసం ఉపయోగించారు. నరేశ్‌ టర్మ్‌లో పెద్దగా ఎఫర్ట్‌ పెట్టలేదు. ఏం జరిగిందో వారిని అడిగితేనే బావుంటుంది. ‘మా’ అనేది ఒక వైట్‌ పేపర్‌ లాంటిది. ఎవరైనా వెళ్లి అకౌంట్స్‌ అడగవచ్చు. అక్కడ డబ్బు దుర్వినియోగం అయిందనేది కరెక్ట్‌ కాదు.

Naga Babu
Naga Babu

సౌత్‌ ఇండియాలో ఉన్న ప్రతి ప్రభుత్వంతో ప్రకాష్‌రాజ్‌కు మంచి సంబంధాలున్నాయి. ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ‘తెలుగు పరిశ్రమ నాకెంతో ఇచ్చింది. నేను ఏదో ఒకటి పరిశ్రమ కోసం చేయాలనుకుంటున్నా. అసోసియేషన్‌ సభ్యులు కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటున్నా’ అని ఓ యాక్షన్‌ ప్లాన్‌తో ప్రకాశ్‌రాజ్‌ ఉన్నారు. బిజీ ఆర్టిస్ట్ మీరు. అసలు ‘మా’ కోసం సమయం కేటాయించగలరా? అని అడిగాను. ఆయన వంద శాతం కేటాయిస్తానని చెప్పారు. ఆయన మాటల్లో నాకు నమ్మకం ఉండడంతో సపోర్ట్‌ చేస్తున్నాను.

‘మా’కు సంబంధించిన విషయాల్లో ప్రకాశ్‌కు ఓ క్లారిటీ ఉంది. స్థలం, బిల్డింగ్‌ నిర్మాణం, ఇతర కార్యక్రమాలు పక్కా ప్రణాళిక ఉంది. అతని ఇంటెన్స్‌కి కన్విన్స్‌ అయ్యి సపోర్ట్‌ చేస్తున్నాం. ప్రకాశ్‌ గెలిచినా, విష్ణు గెలిచినా అంతా కలిసే పని చేస్తాం. ప్రతి రోజు ఒకరి మొహం ఒకరు చూసుకుంటాం. మా ఈ గొడవలన్నీ కూడా రెండు నెలలు ఉంటాయి.. మాదంతా టీ కప్పులో తుపాను లాంటిది.. ఓ రెండు నెలలు మీడియా, జనాలను ఎంటర్టైన్ చేసినట్టు అవుతుంది.. ప్రకాశ్ రాజ్‌కి ఉన్న విజన్, ఆయన చెప్పిన ప్లానింగ్, అతని సామర్థ్యానికి మేం మద్దతిస్తున్నాం. మంచు విష్ణు కూడా బిల్డింగ్ కడతాను అన్నారు.. ఆ స్థలం ఎక్కడ ఉందో.. ఎక్కడి నుంచి తెస్తారో చెబితే బాగుండేది అని నాగబాబు అన్నారు.