Prabhas: ప్రభాస్ నాగ్ అశ్విన్ కథ ఇదే.. డైరెక్టర్ ట్వీట్‌తో అలా లీక్!

Prabhas ప్రస్తుతం టాలీవుడ్‌లో మొత్తంగా అప్డేట్లతో జాతర జరుగుతోంది. దాదాపు ప్రతీ ఒక్క సినిమా అప్డేట్ ఇచ్చేసింది. చిన్నా పెద్దా అని తేడా లేకుండా ప్రతీ ఒక్క సినిమా యూనిట్ తమ నుంచి ఏదో ప్రకటన వచ్చేలా చూసుకుంటుంది. తాజాగా ఇప్పుడు ప్రభాస్ నాగ్ అశ్విన్ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఇప్పటికే ప్రభాస్ సలార్ మూవీ అప్డేట్‌తో నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అయ్యాడు. ఇక తాజాగా మరోసారి ప్రభాస్ సినిమా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్, దీపిక పదుకొణె ముఖ్య పాత్రల్లో నటిస్తోన్న ఈ మూవీ డైరెక్టర్, సినిమాటోగ్రఫర్లను ప్రకటించారు. మహానటి సినిమాతో హిట్ కొట్టిన కాంబోను మళ్లీ ఇలా రిపీట్ చేశారు. మిక్కీ జే మేయర్‌ను సంగీత దర్శకుడిగా పరిచయం చేశారు. అలాగే మహానటి సినిమాటోగ్రఫర్ డాన్‌ను మళ్లీ తీసుకున్నారు. అయితే అప్డేట్ గురించి వైజయంతీ వారు ఓ పోస్ట్ చేశారు. దానిపై డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్పందించాడు.

అలా నాగ్అశ్విన్ వేసిన ట్వీట్‌లోనే అసలు కథను బయటకు చెప్పేశాడు. మాములూగా ఈ సినిమాను టైం మిషన్ నేపథ్యంలో ఉంటుందని, అంటే ఆదిత్య 369 సినిమా టైపులో ఉంటుందని ఆ మధ్య రూమర్లు వచ్చాయి. అందుకే ఈ స్క్రిప్ట్‌కు సింగీతం శ్రీనివాసరావు సహాయ సహకారాలు అందిస్తున్నాడని టాక్ బయటకు వచ్చింది. అలా ఈ సినిమా కథ కథనాల పై రకరకాల పుకార్లు వచ్చాయి.

ప్రభాస్ నాగ్ అశ్విన్ కథ ఇదే.. Prabhas
అయితే తాజాగా నాగ్ అశ్విన్ వేసిన ట్వీట్‌తో అందరికీ క్లారిటీ వచ్చింది. గతంలోంచి ఈ ప్రపంచానికి మహానటి చిత్రంలో గతంలో జరిగిన విషయాలను తీసుకొని ఓ ప్రపంచాన్ని క్రియేట్ చేశాం.. అయితే ఇప్పుడు భవిష్యత్తుల్లోంచి అందమైన ప్రపంచాన్ని ఇప్పుడు క్రియేట్ చేస్తామంటూ చెప్పుకొచ్చాడు. అంటే ఫ్యూచర్‌లోకి వెళ్లబోతోన్నారని, అది టైం మిషన్ కథ అని ఇట్టే అర్థమవుతోంది.

Advertisement