PRABAHS: ప్ర‌భాస్ – నాగ్ అశ్విన్ మూవీపై క్రేజీ బ‌జ్… సైన్స్ ఫిక్ష‌న్‌లోను స‌రికొత్త‌గా చూపిస్తాడ‌ని టాక్

మ‌హాన‌టి సినిమాకు ముందు నాగ్ అశ్విన్ ప‌లు సినిమాలు చేసిన‌ప్ప‌టికీ ఆయ‌న పేరు పెద్ద‌గా ఎక్క‌డా వినిపించ‌లేదు. ఎప్పుడైతే మ‌హాన‌టి సినిమా తీసారో అప్ప‌టి నుండి నాగ్ అశ్విన్ పేరు దేశ వ్యాప్తంగా వినిపిస్తుంది. ద‌ర్శ‌కుడిగానే కాదు నిర్మాత‌గాను రాణిస్తున్నాడు నాగ్ అశ్విన్. ఇటీవ‌ల జాతి ర‌త్నాలు వంటి సినిమా తెర‌కెక్కించి ఫ్యాన్స్‌కు అదిరిపోయే గిఫ్ట్ అందించాడు. అయితే నాగ్ అశ్విన్.. ప్ర‌భాస్‌తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయ‌నుండ‌గా, ఈ సినిమాపై ఇండ‌స్ట్రీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు నడుస్తున్నాయి.

త‌న మూడో సినిమాను పాన్ ఇండియా చిత్రంగా ప్లాన్ చేసిన నాగ్ అశ్విన్ ఈ మూవీని సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో చేస్తాడ‌ట‌. నాగ్ అశ్విన్ కు టెక్నాలజీ – సైన్స్ ఫిక్షన్ జానర్స్ బాగా ఇష్టమట. అందుకే తను అనుకున్న వరల్డ్ లెవెల్ ఆలోచనను పాన్ వరల్డ్ మూవీగా చూపించాలని ఫిక్స్ అయ్యాడు. కొద్ది రోజులుగా ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుండ‌గా, ఈ ఏడాది చివ‌ర‌లో మూవీ సెట్స్ పైకి వెళ్ల‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ సూపర్ హీరోగా కనిపించనున్నాడని టాక్ నడుస్తుంది. ఇంతలోనే మరో క్రేజీ న్యూస్ సినిమా గురించి వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందినా సినిమాలో అడ్వాన్సడ్ ఫ్యూచర్ చూపించనున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమా ద్వారా హై లెవెల్ టెక్నాలజీతో మ‌న‌ల్ని కొద్ది రోజుల ముందుకు నాగ్ అశ్విన్ తీసుకెళ్ల‌నున్నాడ‌ని అంటున్నారు. నాగ్ అశ్విన్ ప్లాన్ ఏ ర‌కంగా ఉన్నాయో కాని ఇండ‌స్ట్రీలో జ‌రుగుతున్న చ‌ర్చ‌లు వింటుంటే మాత్రం అభిమానుల రోమాలు నిక్క‌పొడుచుకుంటున్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ దీపికా పదుకొనే కాగా కీలకపాత్రలో అమితాబ్ బచ్చన్ నటించనున్నారు. సి. అశ్వినిదత్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో రిలీజ్ కాబోతుంది. మరి ఫస్ట్ టైం ఈ సినిమాతో పాన్ వరల్డ్ వైడ్ తన మ్యూజిక్ వినిపించబోతున్నాడు మిక్కీ జే మేయర్. భారీ టీం క‌లిసి స‌రికొత్త ప్ర‌య‌త్నం చేస్తుండ‌గా, దీనిని ప్రేక్ష‌కులు ఎలా ఆద‌రిస్తారో చూడాలి.