NAG ASHWIN : మాట మార్చిన నాగ్ అశ్విన్.. ప్రభాస్ సినిమా అప్‌డేట్ ఇప్పుడు ఇవ్వ‌డం క‌ష్టం అని కామెంట్

NAG ASHWIN : పాన్ ఇండియా క్రేజి స్టార్ గా ఎదిగారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఇప్పుడు ఆయన కెరీర్ ఫుల్ స్వింగ్ తో పాటు సాలిడ్ గా ఉందని చెప్పుకోవచ్చు. వచ్చే రెండేళ్ళ వరకు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఎలాంటి బ్రేక్ లేని రైడ్ లా దూసుకుపోతున్నారు ప్రభాస్. ఇక ఈయన ఆధ్వర్యంలో ఉన్న సినిమాలన్నీ పాన్ ఇండియా మూవీసే. ఈ సినిమాల్లో కొన్ని 500 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలే కావడం విశేషం. దర్శకనిర్మాతలు సైతం ప్రభాస్ సినిమాలకు ఖర్చు చేయడంలో ఏమాత్రం తగ్గడం లేదట. ఇదిలా ఉండగా ప్రభాస్ రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాల తర్వాత మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తో చేస్తున్న భారీ సైన్స్ ఫిక్షన్ అని తెలుస్తుంది.

ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయినా.. ప్రభాస్ ఫ్యాన్స్ కి అప్డేట్ చేస్తునే ఉన్నారు. అయితే లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ సినిమా అప్డేట్స్ ఇవ్వడంలో ఓ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ అప్పుడే ఇవ్వడం కరెక్ట్ కాదని.. ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా రిలీజ్ తర్వాత, అలాగే ప్రతిష్టాత్మక చిత్రం ఆదిపురుష్ సినిమాలు షూటింగ్ మొదలైన తర్వాత తమ సినిమా గురించి అప్డేట్ ఇస్తామని అన్నారు. అప్పటివరకు ఫ్యాన్స్ వేచి ఉండాలని సూచించారు.

దీంతో ఈ సినిమా విషయంలో నాగ్ అశ్విన్ మాట మార్చారంటూ నెటిజన్లు కామెంట్ చేయడం విశేషం. అయితే ఈ సినిమా కంప్లీట్ సైంటిఫికల్ ఫిక్షన్ గా, ఫాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కుతుందని డైరెక్టర్ తెలిపారు. ఏది ఏమైనా ఈ సినిమాకి సంబంధించి అప్డేట్స్ కావాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే అంటున్నారు ఫిల్మ్ టీమ్. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ తో పాటు మరికొన్ని భారీ సెట్స్ కి సంబంధించిన ఆర్ట్ వర్క్ జరుగుతున్నట్లు సమాచారం.

Advertisement