Prabhas: నాగ్ అశ్విన్, ప్రభాస్ మూవీ పాన్ ఇండియా కాదు.. అంతకు మించి..!

Prabhas సూపర్ స్పీడ్ తో పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్నారు. టాలీవుడ్ టూ హాలీవుడ్ రేంజ్ కి ఎదిగిన ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాలో నటిస్తున్నారు. దాంతో పాటు బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్ లో ఆది పురుష్ సినిమాలో వర్క్ చేస్తున్న విషయం తెలిసిందే.

Prabhas & Prashanth Neel

అయితే ప్రభాస్ నటిస్తున్న ప్రతి సినిమా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్నాయి. ఈ సినిమా పూర్తయిన తర్వాత టాలీవుడ్ స్టార్ డమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో మరో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు ప్రభాస్. ఇక నాగ్ అశ్విన్ చిత్రీకరించే సినిమాలన్నీ ఎంతో వినూత్నంగా, విభిన్నంగా ఉంటాయి.

Nag Ashwin & Prabhas

ఇందులో బీటౌన్ హీరోయిన్ దీపికా పదుకొనే నటిస్తున్నారు. స్వప్న సినిమాస్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు తెలుస్తుంది. ఇందులో బాలీవుడ్ బిగ్ బి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా గురించి నాగ్ అశ్విన్ కొన్ని ఆశక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళం, హిందీ మరియు కన్నడ భాషల్లోనే కాకుండా ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ చేయబోతున్నారు.

Prabhas & Deepika padukone

నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడం విశేషం.ఇదే కనుక జరిగితే ఇండియా నుండి విడుదలయ్యే అతి పెద్ద సినిమాగా చరిత్ర సృష్టిస్తుంది. అలాగే ఈ సినిమా 2050 సంవత్సరం నేపథ్యంగా ఉండబోతుందని.. టైమ్ ట్రావెల్ బ్యాక్ డ్రాప్ లో కొనసాగుతుందని తెలుస్తుంది. అలాగే ఈ సినిమా కోసం భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. అన్ని రకాల సాంకేతిక పరిజ్ఞానం వాడుతున్నారు. ఇక ఈ సినిమా లాక్ డౌన్ తర్వాత సెట్స్ మీదకు వచ్చే ఛాన్స్ ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.