Nabha Natesh: చెరువు గ‌ట్టున ఇస్మార్ట్ పోరీ లుక్స్ అదిరిపోయాయిగా..!

Nabha Natesh: ‘నన్ను దోచుకుందువటే’తో తెలుగు తెరకు పరిచయమైన అందాల భామ నభా నటేశ్‌. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’లో రామ్‌కు జోడీగా మాస్‌ డైలాగ్‌లతో దుమ్ము రేపింది. రీసెంట్‌గా నితిన్‌కు జోడీగా మ్యాస్ట్రోలోను సంద‌డి చేసింది. త్రివిక్ర‌మ్- మ‌హేష్ బాబు కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌నున్న సినిమాలోను ఈ అమ్మ‌డికి ఆఫ‌ర్ ద‌క్కిన‌ట్టు తెలుస్తుంది.

Nabha Natesh Stunning Looks in Half saree
Nabha Natesh Stunning Looks in Half saree

ఈ చిత్రంలో పూజా హెగ్డే ఒక హీరోయిన్ కాగా, సెకండ్ హీరోయిన్‌గా న‌భా న‌టేష్‌ని ఎంపిక చేసిన‌ట్టు స‌మాచారం. ఇది నిజ‌మైతే నభా కెరీర్‌లో మరో మంచి చిత్రమవుతుంది. హారిక, హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ(చినబాబు) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

Nabha Natesh Stunning Looks in Half saree
Nabha Natesh Stunning Looks in Half saree

2015లో వచ్చిన ‘వజ్రకయ’ అనే కన్నడ సినిమాతో వెండి తెరకు పరిచయమైంది అందాల తార నభా నటేష్‌. అనంతరం కన్నడలో వరుసగా మూడు చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ 2019లో వచ్చిన ‘ఇస్మార్ట్‌’ శంకర్‌ చిత్రంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో మాస్ డైలాగ్‌లు పలుకుతూ మరోవైపు గ్లామర్‌షోతో కుర్రకారు మతి పోగొట్టిందీ చిన్నది. ఆ సినిమా సక్సెస్‌తో రవితేజ, సాయి ధరమ్‌ తేజ్‌ వంటి హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుందీ బ్యూటీ.


సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే న‌భా న‌టేష్ నిత్యం ప‌లు ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ సంద‌డి చేస్తుంటుంది.తాజాగా నాజూకైన సొగసుతో నభా కుర్రకారుకి అందాల వల వేస్తోంది. లంగాఓణిలో మెరిసిన ఈ ముద్దుగుమ్మ పచ్చని ప్రకృతి ఒడిలో ఫొటో షూట్ చేసి పిచ్చెక్కిస్తుంది.