Pawan Kalyan: పవన్ కళ్యాణ్.. అభిమానుల సునామీ..

Pawan Kalyan తెలుగు సినిమా పరిశ్రమలోని టాప్ అండ్ ‘మెగా’ హీరోల్లో ఒకరైన పవన్ కళ్యాణ్.. పవర్ స్టార్ మాత్రమే కాదంట. ఆయన్ని ‘అభిమానుల సునామీ’ అని కూడా అంటున్నారు. ఈ కొత్త మాట చెప్పిన చిన్నది నభా నటేష్. ఈమె.. పవన్ కళ్యాణ్ సహా మరికొంత మంది టాలీవుడ్ కథానాయకుల గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసింది. రవితేజని ‘మాస్ కా బాప్’ అని, మంచి మనసున్న వ్యక్తి అని గొప్పగా అభిప్రాయపడింది. రామ్ పోతినేనికి ‘ఎనర్జీ బ్లాస్ట్’ అని కితాబిచ్చింది. బెల్లంకొండ శ్రీనివాస్ తో స్క్రీన్ పంచుకోవటం చాలా బాగుందని సంతోషం వ్యక్తం చేసింది. నభా నటేష్ ప్రస్తుతం నితిన్ 30 (‘అంధాధున్’కి రీమేక్) మూవీలో నటిస్తోంది. ఈ చిత్రం ఈ ఏడాది జూన్ 11న ప్రేక్షకుల ముందుకి వస్తోంది.

అందర్నీ దోచుకుంది..

‘నన్ను దోచుకుందువటే’ అనే పిక్చర్ తో అరంగేట్రం చేసిన నభా నటేష్.. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ ఫిల్మ్ ‘ఇస్మార్ట్ శంకర్’లో కూడా యూత్ ని తన వైపుకు తిప్పుకుంది. కానీ.. ఆ రెండు ప్రాజెక్టుల అనంతరం వచ్చిన డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్ హిట్ కాలేదు. దీంతో నభా నటేష్ కాస్త నెమ్మదించింది. లేకపోతే ఈ భామ ఈపాటికి ‘టాప్’ లేపేసేదే. ఇప్పటికైతే నితిన్ మూవీ ఒక్కటే చేతిలో ఉండటం వల్ల కాల్షీట్లు ఖాళీ అవటంతో లేటెస్టుగా మీడియాతో చిట్ చాట్ చేసింది. వ్యక్తిగత అలవాట్లు, ఇష్టాఇష్టాలు, ఇతర విషయాలను ఫ్యాన్స్ తో పంచుకుంది.

ఉత్తిత్తోళ్లు కాదు.. అత్యుత్తములు..

తెలుగు సినిమా ప్రేక్షకులు ఉత్తమ అభిరుచి కలిగినవాళ్లు అని నభా నటేష్ పేర్కొంది. అందుకే వాళ్లంటే తనకు మాటల్లో చెప్పలేనంత అభిమానం ఉందని వెల్లడించింది. తాను ‘మార్నింగ్ పర్సన్’ని కాదని, ‘నైట్ పర్సన్’ని అని తెలిపింది. అంటే ఆమె పొద్దుపొద్దున్నే నిద్ర లేచే రకం కాదంట. హాలిడే ట్రిప్ కి వెళ్లాలంటే ‘గోవా.. ది బెస్ట్’ ప్లేస్ అని సూచించింది. యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలు ఇష్టమని, హైదరాబాద్ బిర్యానీ, హలీమ్ బాగా మెక్కుతానని నభా నటేష్ చెప్పుకొచ్చింది.

Advertisement