Naandhi : నాంది ట్రైల‌ర్ రిలీజ్ చేసిన మ‌హేష్‌.. టీంకు సూప‌ర్ స్టార్ బెస్ట్ విషెస్

Naandhi : కామెడీతో కిత‌కిత‌లు పెట్టించే అల్ల‌రి న‌రేష్ ఇప్పుడు పూర్తి భిన్నంగా, వైవిధ్య‌మైన పాత్ర పోషిస్తూ నాంది అనే చిత్రాన్ని చేశాడు. ఫిబ్ర‌వ‌రి 19న ఈ చిత్ర విడుద‌ల‌కు ప్లాన్ చేశారు మేక‌ర్స్. ఈ సినిమా ద్వారా విజయ్ కనకమేడల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్‌వి2 ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై స‌తీష్ వేగేశ్న నిర్మించారు ఈ చిత్రానికి సంబంధించి విడుద‌లైన ప్ర‌చార చిత్రాలు ప్రేక్ష‌కుల‌లో అంచ‌నాలు పెంచాయి. తాజాగా మ‌హేష్ బాబు నాంది ట్రైల‌ర్ విడుద‌ల చేశారు.

ఇందులో అల్ల‌రి న‌రేష్ త‌న పర్‌ఫార్మెన్స్‌తో అద‌ర‌గొట్టాడు. జైలులో ముద్దాయిగా అల్లరోడు అద‌ర‌గొట్ట‌గా, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ లాయ‌ర్‌గా మంచి ప‌ర్‌ఫార్మెన్స్ క‌న‌బ‌ర‌చింది. హ‌రీష్ ఉత్తమ‌న్‌, ప్రవీణ్‌, ప్రియ‌ద‌ర్శి, దేవీప్రసాద్‌, విన‌య్ వ‌ర్మ, సి.ఎల్‌.న‌ర‌సింహారావు, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, ర‌మేష్‌రెడ్డి, చ‌క్రపాణి, రాజ్యల‌క్ష్మి, మ‌ణిచంద‌న‌, ప్రమోదిని, గ్రిగ్నేశ్వర రావు ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీచరణ్‌ పాకాల అందించిన సంగీతం కూడా సినిమాకు ప్ల‌స్ అయ్యేలా క‌నిపిస్తుంది. మ‌హేష్ చేతుల మీదుగా విడుద‌లైన ట్రైల‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి.

 

Advertisement