NAANDHI ఒకప్పుడు మినిమం గ్యారెంటీ సినిమాలు తీస్తూ వచ్చిన అల్లరి నరేష్ సుడిగాడు చిత్రం నుండి ఫ్లాపులబాట పడ్డాడు. తొమ్మిదేళ్ళుగా ఒక్క హిట్టంటే ఒక్క హిట్ కూడా పడలేదు. ఆకలితో సింహానికి టేస్టీ ఫుడ్ దొరికితే ఎంత సంతృప్తి చెందుతుందో ఇప్పుడు అల్లరోడు నాంది ఇచ్చిన విజయానికి ఉప్పొంగిపోతున్నాడు. మధ్యలో విలక్షణ పాత్రలు చేసి మెప్పించినప్పటికీ సోలో హిట్ అనేది నాందితో రావడం గొప్ప విషయం. ఫిబ్రవరి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తూ బాక్సాఫీస్ దగ్గర జెట్ స్పీడ్‌తో దూసుకుపోతుంది.
నాంది ఫస్ట్ లుక్ పోస్టర్ చూడగానే అల్లరి నరేష్ ఈ సారి కొత్తగా ట్రై చేస్తున్నాడు అని అందరికి అనిపించింది. అయితే ఆయన ప్రయోగం ఎంత వరకు విజయం అందిస్తుందనేది మాత్రం అందరిలో ఓ అనుమానాన్ని కలిగించింది. కాని చిత్ర రిలీజ్ తర్వాత అనుమానాలన్నీ పటాపంచలు అయ్యాయి. అల్లరి నరేష్ పర్ఫార్మెన్స్కు, విజయ్ దర్శకత్వ ప్రతిభకు ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతున్నారు.వీకెండ్ రోజు నాంది థియేటర్స్ అన్ని హౌజ్‌ఫుల్ అయ్యాయి. 5 వ రోజు సాధించిన కలెక్షన్స్‌తో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 2.75 కోట్లను అందుకుంది నాంది. కేవలం ఐదు రోజుల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ కావడంతో నిర్మాతలు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
ఐదో రోజు కలెక్షన్ల వివరాలు చూస్తే
నైజాం-11 లక్షలు
సీడెడ్- 3.2 లక్షలు
ఉత్తరాంధ్ర- 4.2 లక్షలు
ఈస్ట్ గోదావరి- 3.2 లక్షలు
వెస్ట్ గోదావరి- 2 లక్షలు
గుంటూరు- 3.1 లక్షలు
కృష్ణా- 3.3 లక్షలు
నెల్లూరు- 2 లక్షలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి చూస్తే ఐదో రోజుకు గాను 32 లక్షల గ్రాస్, 2.96 కోట్ల షేర్ వసూళ్లు నమోదయ్యాయి. 2.75 కోట్ల బ్రేక్ ఈవెన్‌తో బరిలోకి దిగిన ‘నాంది’ మూవీ మంచి వసూళ్ళతో దూసుకుపోతుండడం విశేషం.మొత్తానికి నాంది చిత్రం ఇచ్చిన పెద్ద విజయంతో అల్లరి నరేష్ రానున్న రోజులలో మరిన్ని ప్రయోగాత్మక చిత్రాలు చేసి ప్రేక్షకులని అలరించాలని అనుకుంటున్నాడు.