Music Director Koti మ్యూజిక్ డైరెక్టర్ కోటి అంటే తెలియని తెలుగు ప్రేక్షకులెవ్వరూ ఉండరు. ఎన్నెన్నో మ్యూజికల్ హిట్స్ ఆయన ఖాతాల్లో ఉన్నాయి. 80, 90వ దశకంలో రాజ్ కోటి సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. అయితే ఇప్పుడు కోటీ బుల్లితెరపై రచ్చచేస్తున్నాడు. పాటల ప్రోగ్రాంకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నాడు. అలాంటి కోటి తాజాగా ఓ సినిమాను ప్రమోట్ చేసేందుకు ముందుకు వచ్చాడు.
సముద్రాల సినీ క్రియేషన్స్ పతాకంపై బేబీ అన్య ఆనంద్ సమర్పణలో సముద్రాల మంత్రయ్య బాబు నిర్మిస్తున్న చిత్రం లవ్ యు రా. ప్రసాద్ ఏలూరి దర్శకుడు. చిను క్రిష్ హీరోగా గీతా రతన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇంట్రెస్టింగ్ పాయింట్ తో లవర్ స్టోరీ చిత్రంగా రాబోతున్న ఈ సినిమా లో శేఖర్, సాయినాధ్, మధు ప్రియ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా ఈశ్వర్ పెరవళి సంగీతం, రవి బైపల్లి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది.

కాగా ఈ చిత్రంలోని ఏ మాయ చేశావే పాటను తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు కోటి రిలీజ్ చేశాడు. అనంతరం కోటి మాట్లాడుతూ.. లవ్ యూ రా సినిమా పాటను రిలీజ్ చేసినందుకు ఎంతో ఆనందంగా ఉంది. పాట చాల బాగుంది. మంచి కంపోజ్ చేశాడు సంగీత దర్శకుడు ఈశ్వర్.. వినగానే క్యాచీగా అనిపించింది. హరిచరణ్ గారు పాడిన ఈ పాటను మీ అందరికి నచ్చుతుంది. విజువల్స్ బాగున్నాయి.. కొరియోగ్రఫీ, సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉన్నాయి. సాంగ్ వింటుంటే ఫ్రెష్ అనిపించింది. టీం అందరికి అల్ ది బెస్ట్ అని చెప్పుకొచ్చాడు.