Pawan Kalyan : సుజిత్, పీకే మూవీకి నో చెప్పిన అనిరుధ్, పవన్ ఫ్యాన్సుకి నిరాశే పాపం
NQ Staff - December 12, 2022 / 09:31 AM IST

Pawan Kalyan : రాక్ స్టార్ అనిరుధ్.. సౌండ్ కి సైజుతో పనిలేదని ప్రూవ్ చేసిన యంగ్ మ్యూజికల్ సెన్సేషన్. సాంగ్స్ వైరలవ్వాలన్నా, థియేటర్ ఊగిపోవాలన్నా, ఆర్ ఆర్ అదిరిపోవాలన్నా ఫస్ట్ చాయిస్ గా అనిరుధ్ నే ప్రిఫర్ చేస్తున్నారు మేకర్స్. ఆడియెన్స్ కూడా అనిరుధ్ మ్యూజిక్ అనగానే అంచనాల్ని తెగ పెంచేసుకుంటున్నారు.
ఇక తాజాగా సుజిత్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ హీరోగా ఓ సినిమా అఫీషియల్ గా అనౌన్సయిన విషయం తెలిసిందే. మూవీలో పవన్ ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ (ఓజీ) అని చెప్పడంతో మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ అయితే సూపరని ఫిక్సయిపోయారు ఫ్యాన్సు. వుయ్ వాంట్ అనిరుధ్ అంటూ ట్విట్టర్లో హ్యాష్ ట్యాగులతో ట్రెండ్ చేశారు కూడా.
ఇంతలా అభిమానులు అనిరుధ్ నే కోరుకోడానికి కూడా స్ట్రాంగ్ రీజన్స్ లేకపోలేదు. రీసెంట్ గా ఘోస్ట్ అంటూ కమల్ నటించిన విక్రమ్ మూవీకి అనిరుధ్ ఇచ్చిన మ్యూజిక్ ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. సౌత్ లో చాలా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టరవ్వడంలో అనిరుధ్ సంగీతానిది ప్రధాన పాత్ర అనేది అందరూ ఒప్పుకునే ఫ్యాక్టే.
ఇక ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే త్రివిక్రమ్ దర్శకత్వంలో పవర్ స్టార్ నటించిన అజ్ఞాతవాసి చిత్రానికి అనిరుధే మ్యూజిక్ ఇచ్చాడు. ఆల్భమ్ లోని అన్ని పాటలతో సహా బీజీఎం, ఆర్ ఆర్.. ఇలా అన్ని రకాలుగా గుర్తుండిపోయేలా మ్యూజిక్ ఇచ్చాడు.
కానీ త్రివిక్రమే తన మేకింగుతో అభిమానులకి మరిచిపోలేని రాడ్ దించాడు. మరి మరిచి పోవడానికి అదేమన్నా జ్ఞాపకమ? గురూజీ దించిన గునపం అంటూ పీకే హార్డ్ కోర్ ఫ్యాన్స్ ప్రతి సంక్రాంతికి బాధపడుతుంటారు. సో.. ఇప్పుడు గ్యాంగ్ స్టర్ బేస్డ్ ప్రాజెక్ట్ కాబట్టి అనిరుధ్ అయితే అదరగొడతాడనేది పవన్ అభిమానుల ఆశ.
మరోవైపు కొన్నాళ్లుగా పవన్ సినిమాలకు థమనే మ్యూజిక్ ఇస్తున్నాడు. భీమ్లా నాయక్, వకీల్ సాబ్ లాంటి చిత్రాలకు సంగీతాన్ని అందించినా, ఆ పాటలు కూడా ఆడియెన్సుని అలరించినా అనిరుధ్ అయితే అవుట్ పుట్ ఇంకా అదిరిపోతుందనేది పీకే ఫ్యాన్స్ కోరిక.
సోషల్మీడియాలో ఇంతలా ట్రెండ్ అవుతుండడంతో అనిరుధ్ తో ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేశాడట డైరెక్టర్ సుజిత్. కానీ తనకున్న ఇతర కమిట్మెంట్లు, ఆల్రెడీ ఒప్పుకున్న ప్రాజెక్టుల వల్ల ఈ సినిమాకి మ్యూజిక్ చేయడం కుదరదని తేల్చి చెప్పేశాడట అనిరుధ్. దీంతో గంపెడాశలు పెట్టుకున్న పవన్ ఫ్యాన్సుకి నిరాశే మిగిలింది పాపం.

Music Director Anirudh Who Said No Pawan Kalyan Movie
నిజానికి అనిరుధ్ ఇప్పుడు సౌత్ వైడ్ గా మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. యంగ్ డైరెక్టర్స్ తో పాటు బడా దర్శకులు కూడా అనిరుధ్ కోసం వెయిట్ చేసే పరిస్థితుంది. ఏ ఆర్ రెహమాన్ లాంటి వాళ్లను కాదనుకుని, శంకర్ కూడా ఇండియన్ టూ మూవీ కోసం అనిరుధ్ నే తీసుకున్నారంటే మనోడి క్రేజ్ ఏ రేంజులో ఉందో చెప్పక్కర్లేదు. మరి అనిరుధ్ స్ట్రెయిటుగా నో చెప్పేశాడు కాబట్టి.. ఇప్పుడు మళ్లీ థమనే ఫిక్సవుతాడేమో చూడాలిక.