Mumaith Khan: ఈడీ విచార‌ణ‌కు హాజ‌రైన ముమైత్ ఖాన్.. ప‌లు కోణాల్లో విచార‌ణ‌

Mumaith Khan: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు 12 మంది సినీ నటులకు నోటీసులు ఇచ్చిన విష‌యం తెలిసిందే. గతంలో ఎక్సైజ్ శాఖ విచారించినవారితో పాటు ఎక్సైజ్ శాఖ విచారించని రకెుల్ ప్రీత్ సింగ్, దగ్గుబాటి రానాలను కూడ ఈడీ విచారించింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో తొలుత దర్శకుడు పూరీ జగన్నాథ్, సినీ తారలు ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్, నందు, దగ్గుబాటి రానా, రవితేజ,నవదీప్ లను ఈడీ ప్రశ్నించింది.

Mumaith Khan at ED Office
Mumaith Khan at ED Office

ఈ రోజు ముమైత్ ఖాన్ ఈడీ విచార‌ణ‌కు హాజ‌రైంది. ముంబై నుండి డైరెక్ట్‌గా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్న ముమైత్ క్యాబ్‌లో ఈడీ ఆఫీసుకి చేరుకుంది. మనీ లాండరింగ్‌ కోణంలో ఆమె బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలన, అనుమానాస్పద లావాదేవీలపై ఆరా తీయనున్నారు. డ్రగ్స్‌ విక్రేత కెల్విన్‌తో ఏమైనా పరిచయం ఉందా? ఆయన అకౌంట్‌కు ఎప్పుడైనా భారీ మొత్తంలో నిధులు పంపించారా.? తదితర వివరాలపై ముమైత్ ను విచారించనున్నారు ఈడీ అధికారులు.

ఈడీ విచార‌ణ‌కు హాజ‌రైన వారిని దాదాపు ఏడు నుండి ఎనిమిది గంట‌ల పాటు విచారించారు. ఈ రోజు ముమైత్‌ని ఎంత సేపు విచారిస్తారు అన్న‌ది తేలాల్సి ఉంది. ఇక 17న తనీశ్, 22న తరుణ్ విచారణకు హాజరుకానున్నారు.

Mumaith Khan at ED Office
Mumaith Khan at ED Office

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మ‌ర‌ణం త‌ర్వాత డ్ర‌గ్స్ కేసు విష‌యంపై విచార‌ణ తీవ్రంగా న‌డుస్తుంది. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని అదుపులోకి కూడా తీసుకున్నారు. అలాగే కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు హీరోయిన్స్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఇప్పుడు ఆ మత్తు టాలీవుడ్ కూడా ఎక్కుతుంది. ప్రత్యక దృష్టి పెట్టిన ఈడీ అధికారులు పలువురు సినిమా తారలను విచారిస్తున్నారు.