mumaith khan: ముమైత్ ఖాన్ అంటే డ్యాన్సులకు, ఐటం సాంగ్స్లకు ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. ఐటం గర్ల్‌గా ఇండస్ట్రీలో తనకంటూ ఓ పేరు సంపాదించుకుని.. తన అందాలతో అందరినీ కట్టిపడేసిన ముమైత్ ఏకంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలో బాగానే క్రేజ్ దక్కించుకుంది. కానీ ముమైత్ ఖాన్ మాత్రం తన స్టార్డంను ఎక్కువ రోజులు కాపాడుకోలేకపోయింది. రాను రాను మమైత్ ఫేడవుట్ అవుతూ వచ్చింది.
ఇప్పుడు బుల్లితెరపై మళ్లీ కనిపిస్తోంది. బిగ్ బాస్ మొదటి సీజన్లో ముమైత్ ఖాన్ కనిపించింది. అయితే బిగ్ బాస్ షోలో పాల్గొనడం వల్ల ముమైత్ ఖాన్‌కు ఒరిగిందేమీ లేదు. అయితే ఆ మధ్య డ్రగ్స్ కేసులో, గతకొన్ని రోజుల క్రితం క్యాబ్ డ్రైవర్ కేసులో ముమైత్ ఖాన్ పేరు బయటకు రావడంతో వార్తల్లో నిలిచింది. అయితే ఇప్పుడు మాత్రం ముమైత్ ఖాన్ డ్యాన్స్ ప్లస్ షోలో ఓ జడ్జ్‌గా వ్యవహరిస్తోంది.
రెచ్చిపోయిన ముమైత్ ఖాన్..: mumaith khan
ముమైత్ ఖాన్ స్టెప్పులు ఇప్పటికీ ఓ సెన్సేషన్. తన వయ్యారాలను తిప్పుతూ వేసే స్టెప్పులంటే కుర్రకారు పడిచచ్చిపోతుంటారు. తాజాగా ముమైత్ ఖాన్ విష్ణు ప్రియ తో కలిసి స్టేజ్ మీద స్టెప్పులు వేసింది. నాటి స్టెప్పులను గుర్తుకు తెచ్చేలా ఒకరితో ఒకరికి పోటీ అనేలా నడుము ఒంపు సొంపులను తెగ తిప్పేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. డ్యాన్స్ ప్లస్ షోలో నిన్నటి ఎపిసోడ్లో విష్ణుప్రియ స్పెషల్ పర్పామెన్స్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఇక నేటి ఎపిసోడ్‌లోనూ మరి కొన్ని సర్ ప్రైజ్‌లు ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. బిగ్ బాస్ ఫేమ్ హారిక ఎంత మంచి డ్యాన్సరో అందరికీ తెలిసిందే. ఆమెను కూడా డ్యాన్స్ ప్లస్ షోలో వాడేశాడు ఓంకార్. తాజాగా ఆమె మీద రిలీజ్ చేసిన ప్రోమో బాగానే వైరల్ అవుతోంది.