MS Dhoni : ధోనితో బ్రేక‌ప్ స్టోరీ గురించి నోరు విప్పిన రాయ్ ల‌క్ష్మీ

MS Dhoni : 32ఏళ్ల రాయ్ లక్ష్మి దాదాపు 15 ఏళ్ల క్రితమే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. టాలీవుడ్ లో శ్రీకాంత్ హీరోగా నటించిన కాంచనమాల కేబుల్ టీవీ చిత్రంతో రాయ్ లక్ష్మి హీరోయిన్ గా 2005లో ఎంట్రీ ఇచ్చింది. త‌ర్వాత అవ‌కాశాలు లేక ఐటెం సాంగ్స్ చేస్తూ ర‌చ్చ‌చేస్తుంది. ఈ అమ్మడు ధోనితో కొన్నాళ్లు ప్రేమాయ‌ణం న‌డిపింది. తాజాగా అతడితో లవ్‌ ట్రాక్‌ నడిపిన విషయంపై స్పందించింది నటి రాయ్‌ లక్ష్మీ.

MS Dhoni and Rai Laxmi break up love story
MS Dhoni and Rai Laxmi break up love story

2008 ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సారథిగా ధోని ఉన్న సమయంలోనే డేటింగ్‌లో ఉన్నట్లు ఆమె పేర్కొంది. ఐపీఎల్ మ్యాచుల అనంతరం జరిగే పార్టీలకు ధోనితో కలిసి రాయ్ లక్ష్మీ హాజరైన్నట్లు అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. అయితే 2008 నుంచి 2009 వరకు వారి డేటింగ్ కొనసాగినట్లు చెబుతారు. ఊహించని విధంగా ధోని, రాయ్ లక్ష్మీ ఏడాదిలోపే బ్రేకప్ చెప్పుకున్నారు.

MS Dhoni and Rai Laxmi break up love story
MS Dhoni and Rai Laxmi break up love story

రాయ్ లక్ష్మీతో బ్రేకప్ తర్వాత మహేంద్ర సింగ్ ధోని సాక్షిని పెళ్లాడాడు. అయితే రాయ్ లక్ష్మీ మాత్రం ఇంకా మ్యారేజ్ చేసుకోలేదు. అయితే ధోనితో బ్రేకప్ గురించి రాయ్ లక్ష్మీ మాట్లాడుతూ.. ఆయనతో రిలేషన్ తన జీవితంపై ఓ మచ్చగా మారిందని పేర్కొంది. ధోనితో బ్రేకప్ జరిగి దాదాపు 12 ఏళ్ల గడిచిపోయినా… ఆ విషయం తనను వెంటాడుతూనే ఉందని పేర్కొంది. నాకు పెళ్లై, పిల్లలు కలిగి వారు పెద్దైన తర్వాత కూడా ధోనితో అఫైర్ గురించి మాట్లాడుతూనే ఉంటారేమో అని వాపోయింది.

సంవత్సరం పాటు రిలేషన్‌షిప్‌లో ఉన్న తర్వాత ధోని, తాను సామరస్యంగా విడిపోవాలని అనుకున్నట్లు రాయ్ లక్ష్మీ స్పష్టం చేసింది. ఎలాంటి గొడవలు లేకుండా బ్రేకప్ చెప్పుకొన్నట్లు వెల్లడించింది. బ్రేకప్ జరిగినా తమకు ఒకరిపై మరొకరికి రెస్సెక్ట్ ఉందని పేర్కొంది. ధోని తర్వాత తన జీవితంలో చాలా బ్రేకప్స్ జరిగాయని… అయినా తానెప్పుడూ బాధపడలేదని వెల్లడించింది. హ్యాపీగానే జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నానని.. ప్రస్తుతం కెరీర్‌పైనే దృష్టిపెట్టాను అని రాయ్ లక్ష్మీ స్పష్టం చేసింది.

చాలా చిత్రాల్లో హీరోయిన్ గా మెరిసిన రాయ్ లక్ష్మి ఆ తర్వాత స్పెషల్ సాంగ్స్ తో కూడా పాపులర్ అయింది. బలుపు, సర్దార్ గబ్బర్ సింగ్, ఖైదీ నెంబర్ 150 చిత్రాల్లో రాయ్ లక్ష్మి చేసిన ఐటెం సాంగ్స్ సూపర్ హిట్ గా నిలిచాయి. ఖైదీ నెం 150 చిత్రంలో చిరు సరసన రాయ్ లక్ష్మి ‘రత్తాలు’ అనే సాంగ్ లో చిందులేసింది. దీనితో అప్పటి నుంచి అభిమానులు రాయ్ లక్ష్మిని ముద్దుగా రత్తాలు అని పిలుస్తున్నారు.