Mrunal Thakur : సీతారామం బ్యూటీ మరీ ఓవర్ యాక్షన్‌ చేస్తుందా.. ఇలా అయితే కష్టమే అమ్మడు

NQ Staff - April 1, 2023 / 09:42 PM IST

Mrunal Thakur : సీతారామం బ్యూటీ మరీ ఓవర్ యాక్షన్‌ చేస్తుందా.. ఇలా అయితే కష్టమే అమ్మడు

Mrunal Thakur : హిందీ టీవీ సీరియల్స్ తో ఉత్తరాది ప్రేక్షకులకు పరిచయమైన మృణాల్‌ ఠాకూర్ ఆ తర్వాత మరాఠీ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది. మొదటి సినిమాతోనే హీరోయిన్ గా సక్సెస్ సొంతం అవడంతో హిందీలో కూడా ఈ అమ్మడు సినిమాలు చేయడం మొదలు పెట్టింది.

గత సంవత్సరం తెలుగులో సీతారామం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో మొదటి సినిమా తోనే సూపర్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మకు సౌత్ నుండి వరుసగా ఆఫర్స్ లభిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు నాని కి జోడిగా మాత్రమే ఈమె నటించేందుకు ఓకే చెప్పింది.

తన వద్దకు వచ్చిన ప్రతి ఒక్క స్క్రిప్ట్ ని, దర్శకుడిని, నిర్మాతని మృణాల్‌ ఠాకూర్ వెనక్కి పంపిస్తుందని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కథ నచ్చాలి.. బడ్జెట్ నచ్చాలి.. దర్శకుడు నచ్చలి.. ఇలా ఎన్నో నచ్చాలి అంటూ ఓవరాక్షన్ చేస్తూ మృణాల్‌ ఠాకూర్ సినిమాలను వద్దంటుంది అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలాంటి సమయంలో వరుసగా సినిమాలు చేసి పాపులారిటీని సొంతం చేసుకొని నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి కానీ ఇలా చేస్తుంది ఏంటి అంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us