MP Raghav Chadha And Parineeti Chopra : పెండ్లికి ముందే ప్రియుడితో హనీమూన్ కు వెళ్లిన స్టార్ హీరోయిన్..!
NQ Staff - June 11, 2023 / 09:00 AM IST

MP Raghav Chadha And Parineeti Chopra : పెండ్లికి ముందే డేటింగ్ లు చేయడం సినిమా సెలబ్రిటీలకు బాగా అలవాటు అయిపోయింది. ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ కూడా ఇదే బాట పట్టింది. ఆమె ఎవరో కాదు పరిణీతి చొప్రా. ప్రియాంక చొప్రా చెల్లెలు అయిన ఈ భామ బాలీవుడ్ లో చాలా సినిమాల్లో నటించింది. కానీ అక్క రేంజ్ కు ఎదగలేకపోయింది.
ఇక సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే ఎంపీ రాఘవ్ చద్దాతో ప్రేమలో పడింది. వీరిద్దరూ చిన్ననాటి నుంచే స్నేహితులు. కాగా చాలా కాలంగా డేటింగ్ చేస్తున్న వీరిద్దరూ రీసెంట్ గానే ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. గత నెల 13వ తేదీన ఎంగేజ్ మెంట్ చేసుకున్న ఈ ఇద్దరూ ఇప్పుడు బాగానే ఎంజాయ్ చేస్తున్నారు.
తాజాగా వీరిద్దరూ లండన్ టూర్ కు వెళ్లిపోయారు. అక్కడ జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ ను వీక్షించి సందడి చేశారు. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో గ్యాలరీ నుంచి కొత్త జంట మాచ్ ను చూస్తూ ఎంజాయ్ చేసింది ఈ జంట. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
అయితే వీరిద్దరి ఫొటోలు చూసిన వారంతా.. వీరు పెండ్లికి ముందే హనీమూన్ ట్రిప్ కు వెళ్లారా అంటూ కామెంట్లు పెడుతున్నారు. పెండ్లికి ముందే ఇలాంటి ట్రిప్ లు బహుషా ఎవరూ వేయలేదు. మరి ఈ జంట పెండ్లికి ముందే అన్నీ కానిచ్చేస్తున్నారా అంటూ అడుగుతున్నారు నెటిజన్లు. మరి మీ అభిప్రాయం ఏంటో కూడా తెలియజేయండి.