Appu gayatri rao: గుర్తు ప‌ట్టకుండా మారిన హ్యాపీడేస్ అప్పు.. న్యూ లుక్ చూసి స్ట‌న్ అవుతున్న ఫ్యాన్స్

most-shocking makeover-appu-gayatri-rao
most-shocking makeover-appu-gayatri-rao

హ్య‌పీడేస్ చిత్రంలో నిఖిల్‌ క్లోజ్ ఫ్రెండ్‌గా మూవ్‌ అయ్యే అప్పు అలియాస్‌ అపర్ణ అందరికి గుర్తుండే ఉంటుంది. . తొలి సినిమాయే అయినా.. ఎంతో అనుభవం ఉన్నట్లు నటించింది. హ్యాపీ డేస్ సినిమా తరువాత రామ్ చరణ్ నటించిన ‘ఆరంజ్’పవన్ కల్యాణ్‌ ‘గబ్బర్ సింగ్’ సినిమాలోనూ నటించిన గాయత్రిరావు.

ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీకి వెళ్లింది. అక్కడ కూడా ఒకటి రెండు సినిమాల్లో నటించింది. ఆ తర్వాత సినిమా అవకాశాలు రాకపోవడంతో 2019లో వివాహం చేసుకొని చెన్నైలో స్థిరపడిపోయింది. ఇప్పుడు ఈమెను చూస్తే కనీసం గుర్తు కూడా పట్టరు.
అంతగా మారిపోయింది అప్పు. అప్పుడు చాలా సన్నగా కనిపించిన ఈ అమ్మాయి ఇప్పుడు బరువు పెరిగిపోయింది.

ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో అవకాశం వస్తే మళ్లీ నటిస్తానని చెప్పింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది గాయత్రి రావు. ఆమె ఫ్యామిలీ విషయానికి వస్తే.. ఆమె తల్లిదండ్రులు సినీ పరిశ్రమకు చెందిన వారు. తల్లి పేరు బెంగుళూర్ పద్మ. తండ్రి అరుణ్ కుమార్.

most-shocking makeover-appu-gayatri-rao1
most-shocking makeover-appu-gayatri-rao1

పద్మ టాలీవుడ్‌లో ఎన్నో సినిమాల్లో నటించింది. హ్యాపీ డేస్ సినిమాలో కూడా పద్మ నిఖిల్ కి అమ్మగా నటించింది. ఈమె పాత చిత్రాలలో చాలా హిట్ సినిమాల్లో కూడా నటించింది. సినీ బ్యాగ్రౌండ్‌ ఉన్నప్పటికీ.. సినిమా అవకాశాలను దక్కించుకోవడంలో గాయత్రీ రావు విఫలమైంది.