Most Eligible Bachelor: అక్టోబర్ 15 కి షిఫ్ట్ అయిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్..

Most Eligible Bachelor: అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా, పూజా హెగ్దే హీరోయిన్ గా వస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ సినిమాని బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించారు. విలక్షమైన పాత్రలతో, వినూత్నమైన కథతో కొత్త ఫీల్ గుడ్ సినిమాని అందించనున్నట్లు తెలిపారు. ఈ సినిమాకి అల్లు అరవింద్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.

Most Eligible Bachelor to be Released on October15
Most Eligible Bachelor to be Released on October15

ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్, పోస్టర్లు, టీజర్, గ్లింప్స్, లిరికల్ సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ రావడంతో ప్రేక్షకుల్లో మొదటి నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి. అఖిల్ కెరీర్ కి ఇదొక బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని అభిమానులు అంటున్నారు.

కరోనా కారణంగా ఇప్పటివరకు ఈ సినిమా పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే. ఇక లేటెస్ట్ గా ఫిల్మ్ టీమ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాని దసరాకి అక్టోబర్ 8న రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ విషయమై సోషల్ మీడియాలో పోస్టర్ ని రిలీజ్ చేసింది ఫిల్మ్ టీమ్.

అయితే ఈ సినిమా మరో వారం రోజులు పోస్ట్ పోన్ అవుతుందనే వార్తలు ప్రస్తుతం చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాని సరిగ్గా దసరా రోజున అక్టోబర్ 15న రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ఈ క్రమంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాని థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకు రావడానికి అక్టోబర్ 15 న వస్తున్నట్లు ఫిల్మ్ టీమ్ ప్రకటించినట్లు తెలుస్తుంది.

ఈ క్రమంలో ఈ సినిమా కోసం వెయిట్ చేసే అభిమానులకు సరిగ్గా దసరాకి బంపర్ బొనంజా రానుంది.