Most Eligible Bachelor Review: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ రివ్యూ

Most Eligible Bachelor Review: తెలుగులో యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని, పూజా హెగ్దే హీరోయిన్ గా వస్తున్న మోస్ట్ రొమాంటిక్ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా ఈరోజు రిలీజ్ చేసింది ఫిల్మ్ టీమ్. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

Most Eligible Bachelor Review and Rating
Most Eligible Bachelor Review and Rating

కథ:

హర్ష అనే ఓ ఎన్నారై ఇరవై రోజుల్లో పెళ్ళి చేసుకోవడానికి హైదరాబాద్ వస్తాడు. ఎంతోమంది పెళ్ళి కూతుళ్ళను చూసే ప్రాసెస్ లో ఉంటాడు. వారిలో ఒక పెళ్ళికూతురైన విభ, ఆమె ఫ్యామిలీ మెంబర్స్ హర్ష ను రిజెక్ట్ చేస్తుంది. కానీ హీరో హర్ష మాత్రం విభ టాలెంట్ కి క్యారెక్టర్, ఆమె ఇండిపెండెన్సిటీకి ఫ్లాట్ అవుతాడు. అసలు విషయం ఏంటంటే.. విభకి పెళ్ళి మీద అంత ఇంట్రెస్ట్ లేదనే విషయం హర్షకి తెలుస్తుంది. అసలు విభ పెళ్ళి ఎందుకు చేసుకోకూడదు అనుకుంటుంది? హర్ష తన ప్రయత్నాల్ని ఎలా స్టార్ట్ చేసాడు? ఈ క్రమంలో ఎదురయ్యే సిట్యూవేషన్స్ ఏంటో తెలియాలంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చూడాల్సిందే.

నటీనటుల నటన :

ఆన్ స్క్రీన్ మీద అఖిల్ తనకు సరిగ్గా సూట్ అయ్యే పాత్రను సెలెక్ట్ చేసుకున్నారు. కథలోకి ఎంటర్ అయ్యాక ఖచ్చితంగా అఖిల్ క్యారెక్టర్ కు కనెక్ట్ అవుతారు. విభ, హర్షల మధ్య కామెడీ, రొమాన్స్, డ్రామా ఇలా ప్రతి ఒక్క అంశం వర్కవుట్ అయ్యింది. ఇక సెకండాఫ్ లోనే హీరోహీరోయిన్స్ మధ్య ఓ డీల్ ని సెట్ చేసుకుంటారు. అఖిల్ తన పాత సినిమాలతో కంపేర్ చేసుకుంటే ఈ సినిమాలో తన పర్ఫార్మెన్స్ బావుంటుంది. విభ పాత్ర కూడా ముందు నుండి అనుకున్నట్లుగానే డిఫరెంట్ గా ఎంటర్ టైన్ చేస్తుంది.

Most Eligible Bachelor Review and Rating
Most Eligible Bachelor Review and Rating

టెక్నీషియన్స్ :

డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ అందించిన కృషి క్లియర్ గా స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ బావుంటుంది. అలాగే సినిమాలో కామెడీ కూడా వర్కవుట్ అయ్యింది. బొమ్మరిల్లు భాస్కర్ స్పెషాలిటీ ఏంటంటే తన సినిమాల్లో హీరోయిన్స్ ని ఎంతో వినూత్నంగా చూపిస్తారు. కేవలం గ్లామర్ కోసమే కాకుండా కథను ముందుకు నడిపించే రీతిలో ఉంటుంది. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పాటు సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ కూడా అద్భుతంగా ఉంది.

విశ్లేషణ :

అఖిల్ అక్కినేనికి ఇదొక మంచి సినిమా. తన పాత్రలో ఒదిగిపోయి నటించడం బావుంటుంది. దాదాపు 2 ఇయర్స్ గా వెయిట్ చేసినా మంచి సక్సెస్ ను అందుకోవడం అఖిల్ ఫ్యాన్స్ కు ఆనందాన్ని ఇస్తుంది.

Most Eligible Bachelor Review and Rating
Most Eligible Bachelor Review and Rating

ప్లస్ పాయింట్స్ :

  • అఖిల్
  • పూజా హెగ్దేల పర్ఫార్మెన్స్
  • మ్యూజిక్

మైనస్ పాయింట్స్

  • సెకండ్ హాఫ్ లో కొన్ని లాగ్ సీన్స్

చివరగా : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా అఖిల్ ఫర్వాలేదనిపించాడు..

రేటింగ్: 2.75/ 5