Most Eligible Bachelor: రెండో రోజు కాస్త నిరాశ‌ప‌ర‌చిన బ్యాచిల‌ర్‌.. ఇంకా ఎంత రాబ‌ట్టాలి అంటే..!

NQ Staff - October 17, 2021 / 10:34 AM IST

Most Eligible Bachelor: రెండో రోజు కాస్త నిరాశ‌ప‌ర‌చిన బ్యాచిల‌ర్‌.. ఇంకా ఎంత రాబ‌ట్టాలి అంటే..!

Most Eligible Bachelor: అఖిల్, పూజా హెగ్డే ప్ర‌ధాన పాత్ర‌ల‌లో బొమ్మరిల్లు భాస్కర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అనే సినిమాను చేసిన సంగతి తెలిసిందే. ఎన్నో అడ్డంకులు, వాయిదాల తర్వాత ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అంతేకాదు మంచి వసూళ్లను రాబడుతోంది. వరుస పరాజయాలతో సతమతమవుతోన్న అఖిల్‌కు ఈ సినిమా హిట్ అవ్వడం ఎంతో కీలకంగా మారింది. అటు బొమ్మరిల్లు భాస్కర్ కెరీర్ కి కూడా ఈ సినిమా కీల‌కం అయింది.

Most Eligible Bachelor 2nd Day Collections

Most Eligible Bachelor 2nd Day Collections

హ్యాండ్సమ్‌ లుక్స్‌తో పాటు యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ చేయగల నైపుణ్యం ఉన్నా ఎందుకనో మనోడు సక్సెస్‌ను అందుకోలేకపోయాడు. అయినప్పటికీ వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. రీసెంట్‌గా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రం చేయ‌గా, ఈ సినిమాను అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌పై బన్నీవాస్‌, వాసు వర్మ సంయుక్తంగా నిర్మించారు. గోపీ సుందర్ సంగీతం అందించాడు. ఈ చిత్రం ఎన్నో అంచనాలతో ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ మూవీ తెలుగు రాష్ట్రాల్లో రూ. 17.50 కోట్ల వ్యాపారం జరుపుకుంది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా కూడా బాగానే ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాతో పాటు ఓవర్సీస్‌లో కలిపి దీనికి రూ. కోటి బిజినెస్ జరిగిందట. వీటితో కలుపుకుంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి రూ. 18.50 కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలిసింది.

అఖిల్ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే భారీ రెస్పాన్స్ వచ్చింది. రెండు రాష్ట్రాల్లో రూ. 5.45 కోట్లు షేర్, రూ. 9.10 కోట్లు గ్రాస్ వచ్చింది.రెండో రోజు నైజాంలో 1.7 Cr, సీడెడ్ – 0.93 Cr, యూఏ – 0.53 Cr , గుంటూర్ – 0.29 Cr, ఈస్ట్ – 0.25 Cr , వెస్ట్ – 0.19 Cr, కృష్ణ – 0.26 Cr , నెల్లూరు – 0.2 Cr వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఈ క్ర‌మంలో రెండో రోజు 4.35 కోట్ల షేర్ రాబ‌ట్ట‌గా, రెండు రోజుల‌కు 9.5 కోట్ల షేర్ ల‌భించింది. థియేట్రిక‌ల్ రైట్స్ 19 కోట్ల‌కు అమ్ముడు పోగా, ఇంకా 50 శాతం వ‌సూళ్లు రాబ‌ట్టాల్సి ఉంది.

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ మూవీకి మొదటి రోజే రూ. 9.10 కోట్లు గ్రాస్ వచ్చింది. దీంతో సెకెండ్ వేవ్ తర్వాత విడుదలైన చిత్రాల్లో ఎక్కువ వసూలు చేసిన రెండో ఇండియన్ మూవీగా ఇది రికార్డు క్రియేట్ చేసింది. దీనికంటే ముందు రూ. 11 కోట్లతో ‘లవ్ స్టోరీ’ ఉండగా.. తర్వాత ‘సీటీమార్’ రూ. 5 కోట్లతో రెండో స్థానంలో.. ‘సాంగ్ చీ’ రూ. 4.15 కోట్లతో మూడో స్థానంలో, ‘బెల్‌బాటమ్’ రూ. 3.55 కోట్లతో నాలుగో స్థానంలో ఉన్నాయి.

Read Today's Latest బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us