Most Eligibile Bachelor: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ మ‌ళ్లీ వాయిదానా..అఖిల్‌తో ఇలా ఆడుకుంటున్నారేంటి?

Most Eligibile Bachelor: అక్కినేని వారసుడు అఖిల్ అదే పేరుతో తొలి సినిమా చేసి చేతులు కాల్చుకున్నాడు. త‌ర్వాత చేసిన హలో, మిస్ట‌ర్ మ‌జ్ను కూడా నిరాశ‌ప‌రిచాయి. దీంతో త‌న నాలుగో సినిమాగా బొమ్మ‌రిల్లు వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా తీసిన బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ చిత్రాన్ని చేశాడు. రొమాంటిక్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Most Eligibile Bachelor Movie Once Again Postponed
Most Eligibile Bachelor Movie Once Again Postponed

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుందని కొద్ది రోజుల క్రితం ప్ర‌క‌టించారు. అయితే చిత్రం మ‌రోసారి వాయిదా ప‌డ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

మోస్ట్ ఎలిజిబుల్ చిత్రం ఎప్పుడోవిడుద‌ల కావ‌ల‌సి ఉన్న‌ప్ప‌టికీ ప‌లు కార‌ణాల వ‌ల‌న వాయిదా ప‌డింది. ఈ సినిమాని ప‌లు రీషూట్స్ కూడా చేశారు. అయితే అక్టోబ‌ర్ 8న సినిమా వ‌స్తుంద‌డ‌ని అంద‌రు ఆశించిన‌ప్ప‌టికీ చిత్రం మ‌ళ్లీ వాయిదా ప‌డిన‌ట్టు తెలుస్తుంది.దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

రొమాంటిక్ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే పాత్ర ఆమె నిజ జీవితానికి దగ్గరగా ఉంటుందని తెలుస్తోంది. రెండు భిన్న మనస్తత్వాలున్న ఇద్దరి ప్రేమాయణం.. ఎలా పెళ్లి పీటలవరకు వచ్చిందనేదే ఈ సినిమా అని మేకర్స్ తెలిపారు. ఇందులో ఆమని, మురళీశర్మ, జయప్రకాష్ కీలక పాత్రలలో కనిపించనున్నారు. గోపీసుందర్‌ స్వరాలు అందించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి.