Adipurush Movie : నిజంగానే ఆదిపురుష్ సినిమా చూసిన హనుమంతుడు.. ఫొటో వైరల్..!

NQ Staff - June 16, 2023 / 03:35 PM IST

Adipurush Movie : నిజంగానే ఆదిపురుష్ సినిమా చూసిన హనుమంతుడు.. ఫొటో వైరల్..!

Adipurush Movie  : గత కొన్ని రోజులుగా ఆదిపురుష్ మూవీ గురించి పెద్ద చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ ను చూసేందకు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఓం రౌత్ దాదాపు రూ.500 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇందులో కృతిసనన్ సీతగా నటిస్తోంది. దాంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక ప్రతి థియేటర్ లో హనుమంతుడి కోసం ఓ సీటును కూడా కేటాయిస్తున్నారు. రాముడు ఎక్కడ ఉంటే అక్కడ హనుమంతుడు ఉంటాడనే నమ్మకంతో ఇలా చేస్తున్నారు. ఆసీట్లో హనుమంతుడు కూర్చుని సినిమా చూస్తారని వారి అభిప్రాయం. అయితే ఇప్పుడు ఓ థియేటర్ లో నిజంగానే హనుమంతుడు సినిమా చూశాడు.

ఆదిపురుష్ సినిమా ఆడుతున్న ఓ థియేటర్ లోకి ఓ వానరం వచ్చింది. కాసేపు సినిమా చూసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో వానర రూపంలో నిజంగానే హనుమంతుడు వచ్చి సినిమా చూశాడని అంటున్నారు కొందరు. యాదృచ్చికంగా జరిగిన ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చర్చనీయాంశం అయింది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us