Mahesh Babu: మ‌హేష్‌తో స్టెప్పులేయ‌నున్న మోనాల్.. అస‌లు నిజం ఏంటో చెప్పుకొచ్చిన గుజ‌రాతీ బ్యూటీ

Mahesh Babu బిగ్ బాస్ ముందు వ‌ర‌కు మోనాల్ అంటే ఎవ‌రు అని ప్ర‌శ్నించిన జ‌నాలు ఇప్పుడు ఆమె జపం చేస్తుండ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది. బుల్లితెర‌, వెండితెర‌పై అల‌రిస్తూ సోష‌ల్ మీడియాలో ప‌లు ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది. స్టార్ మాలో డ్యాన్స్ షోకు జ‌డ్జిగా ఉన్న మోనాల్ రీసెంట్‌గా ప‌లు సినిమాల‌కు సైన్ చేసిన‌ట్టు తెలుస్తుంది. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా రూపొందుతున్న స‌ర్కారు వారి పాట చిత్రంలో మోనాల్ స్పెష‌ల్ సాంగ్ చేయ‌నుందని గ‌త కొద్ది రోజులుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇందులో నిజ‌మెంత ఉందో తెలియ‌క అభిమానులు సందేహించారు. కొంద‌రు నెటిజ‌న్స్ ఆమెను సోష‌ల్ మీడియా వేదిక‌గా క్లారిటీ తీసుకునే ప్ర‌య‌త్నం చేశారు.

మ‌హేష్‌ బాబుతో స్పెష‌ల్ సాంగ్ చేయ‌నుంద‌ని వ‌చ్చిన వార్త‌ల‌ను మోనాల్ కొట్టిపారేసింది. అందులో ఏ మాత్రం నిజం లేద‌ని, నేను ఎలాంటి స్పెష‌ల్‌లో సాంగ్ ఆడిపాడటం లేద‌ని పేర్కొంది. దీంతో అభిమానుల‌కు ఓ క్లారిటీ వ‌చ్చేసింది. కాగా, మోనాల్ గ‌జ్జ‌ర్ ఇటీవ‌ల విడుద‌లైన‌ అల్లుడు అదుర్స్ అనే సినిమాలో స్పెష‌ల్ సాంగ్ చేసి అభిమానుల‌ని అల‌రించిన విష‌యం తెలిసిందే. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో క‌లిసి మోనాల్ వేసిన స్టెప్స్ ఫ్యాన్స్‌కు మంచి వినోదాన్ని అందించాయి. మోనాల్‌ను త్వ‌ర‌లో హీరోయిన్‌గా మంచి సినిమాలో చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

రీసెంట్‌గా కాగ‌జ్ అనే హిందీ చిత్రంతో అల‌రించిన మోనాల్ రీసెంట్‌గా మ‌రో హిందీ సినిమాకు సైన్ చేసిన‌ట్టు స‌మాచారం. కాగ‌జ్ చిత్రంలోమంచి ప‌ర్‌ఫార్మెన్స్ క‌న‌బ‌రచిన నేప‌థ్యంలో ఈ గుజ‌రాతీ భామ‌కు హిందీ సినిమాలో ఆఫ‌ర్ ద‌క్కింద‌ని అంటున్నారు. ఇక ఇదిలా ఉంటే స్టార్ మా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంద‌రితో క‌లిసి ఓ ప్రోగ్రాం ప్లాన్ చేసిన‌ట్టు తెలుస్తుంది. ఇటీవ‌ల మోనాల్ కూడా ఆ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌గా, అందులో దిగిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. అఖిల్‌, సోహెల్, మెహ‌బూబ్‌తో క‌లిసి సంద‌డి చేసిన ఫొటోల‌ను ఇన్‌స్టాలో షేర్ చేసి నెటిజ‌న్స్‌కు ఆనందాన్ని క‌లిగించింది.

Advertisement