Monal: బాలీవుడ్ ప్రాజెక్ట్ క‌న్‌ఫాం చేసిన మోనాల్.. రానున్న రోజుల‌లో ర‌చ్చ చేయ‌డం ఖాయం

Samsthi 2210 - January 29, 2021 / 11:46 AM IST

Monal: బాలీవుడ్ ప్రాజెక్ట్ క‌న్‌ఫాం చేసిన మోనాల్.. రానున్న రోజుల‌లో ర‌చ్చ చేయ‌డం ఖాయం

Monal బిగ్ బాస్ షోకు రాక‌ముందు కొంద‌రికి మాత్ర‌మే తెలిసిన మోనాల్ ప్ర‌స్తుతం వ‌రుస ఆఫ‌ర్స్‌తో దూసుకెళుతూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. దాదాపు వంద రోజుల పాటు బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న మోనాల్ వ‌చ్చీ రాని తెలుగుతోనే తెగ సంద‌డి చేసింది. టాస్క్‌ల‌లోను మంచి ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర‌చింది. ఇక అఖిల్‌తో రొమాన్స్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. బిగ్ బాస్ షోలో మోనాల్ చేసిన సంద‌డికి ఆమెకంటూ స‌ప‌రేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. మోనాల్ ఏం చేసిన చూసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఫ్యాన్స్ హింట్స్ ఇస్తున్నారు. ఈ క్ర‌మంలో మోనాల్‌కు అనేక ఆఫ‌ర్స్ త‌లుపుతడుతున్నాయి.

మోనాల్ ప్ర‌స్తుతం బుల్లితెర‌పై ఓ డ్యాన్స్ షో చేస్తుండ‌గా, వెండితెర‌ పై అల్లుడు అదుర్స్ అనే సినిమాలో బెల్ల‌కొండ సాయి శ్రీనివాస్‌తో క‌లిసి మాస్ సాంగ్‌కు స్టెప్పులు వేసి అల‌రించింది. మోనాల్ ప‌ర్‌ఫార్మెన్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.మ‌రోవైపు ఈ అమ్మ‌డిని ప‌లు ఆఫ‌ర్స్ ప‌ల‌కరిస్తున్న‌ట్టు తెలుస్తుంది. తెలుగులోనే కాదు త‌మిళం, హిందీ భాష‌ల‌లోను మోనాల్ ఫుల్ బిజీగా మారింది. ఇటీవల‌ బాలీవుడ్‌లో కాగ‌జ్ అనే సినిమా చేయ‌గా, ఈ సినిమా అజంఘర్‌కు చెందిన భరత్‌ లాల్‌ బిహారీ అనే రైతు జీవిత కథ ఆధారంగా రూపొందింది. స‌ల్మాన్ ఖాన్ నిర్మాత‌గా త‌న సొంత బేన‌ర్‌లో ఈ చిత్రాన్ని నిర్మితం కాగా, ఇందులో మోనాల్‌ గజ్జర్‌, పంకజ్‌ త్రిపాఠి ప్రధాన పాత్రలు పోషించారు.

కాగ‌జ్ చిత్రం కొద్ది రోజుల క్రితం జీ5 ఓటీటీలో విడుద‌ల చేశారు. ఇందులో మోనాల్ రెస్పాన్స్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ప్రవేశ్‌మల్లిక్ సంగీతంలో రూపొందిన బైల్ గాడి అనే పాట‌ని ఉదిత్ నారాయ‌ణ్, అల్కా యాగ్నిక్ ఆల‌పించ‌గా, ఈ పాట‌కు మోనాల్ అభిన‌యం అదిరింది. ఈ సినిమా చూసి మోనాల్‌కు మంచి భ‌విష్య‌త్ ఉంద‌ని అన్నారు.. నాన్‌ గ్లామరస్‌ బ్యాక్‌డ్రాప్‌ చిత్రంగా రూపొందిన‌ ఈ చిత్రంలో మోనాల్ లుక్ అభిమానులని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. అయితే బాలీవుడ్‌లో మ‌రో సినిమా చేయ‌నున్న‌ట్టు మోనాల్ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పేర్కొంది. దీనికి సంబంధించి త్వ‌ర‌లోనే అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానుంది. ఏదేమైన 2021లో మోనాల్ హ‌వా మాములుగ ఉండ‌ద‌ని అర్ద‌మ‌వుతుంది.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us