Monal Gajjar: అక్కినేని హీరో సినిమా ఛాన్స్‌ కొట్టేసిన మోనాల్ గ‌జ్జ‌ర్

Monal Gajjar: మోనాల్ గ‌జ్జ‌ర్..ఈ పేరు ఒక‌ప్పుడు ప్రేక్ష‌కులకి ప‌రిచ‌య‌మే లేదు. ఏదో కొన్ని సినిమాల‌లో న‌టించినా కూడా అంతగా పేరు ప్ర‌ఖ్యాత‌లు పొంద‌లేదు. అల్లరి నరేష్‌తో నటించిన ఈ అమ్మ‌డు ఆ త‌ర్వాత పెద్ద‌గా తెలుగు సినిమాల‌లో క‌నిపించ‌లేదు.అడ‌పాద‌డ‌పా ఇత‌ర భాష‌ల‌లో న‌టిస్తూ కాలం గడుపుకుంటూ వ‌చ్చింది.

బిగ్ బాస్ సీజ‌న్ 4 ఛాన్స్ అందుకున్న మోనాల్ గ‌జ్జ‌ర్ దెబ్బ‌కు సెల‌బ్రిటీ స్టేట‌స్ సంపాదించేసింది. హౌజ్‌లో ఉన్న‌న్ని రోజులు ఆమెపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అభిజిత్ మరియు అఖిల్ లతో క్లోజ్‌గా ఉంటూ ఇద్ద‌రిని చీట్ చేస్తుంద‌ని ఆమెపై ప‌లు అప‌వాదులు వ‌చ్చాయి. ఆమెను చాలా మంది చాలా రకాలుగా అనుకుంటూ వచ్చారు. అయినా కూడా తన పద్దతిన తాను ఆడి చివరి వారం వరకు వచ్చింది.

బిగ్ బాస్ హౌజ్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చాక మోనాల్‌కి ఆఫ‌ర్స్ క్యూ క‌ట్టాయి. సినిమాలు, వెబ్ సిరీస్ లు, టీవీ షోస్ ఇలా ఒక‌టేంటి మోనాల్ కాల్షీట్స్ ఫుల్ బిజీ అయ్యాయి. తాజాగా ఈమె హీరోయిన్ గా అఖిల్ హీరోగా ఒక వెబ్ సిరీస్ ప్రాజెక్ట్ పట్టాలెక్కిన విషయం తెల్సిందే. ఇదే సమయంలో ఐటెం సాంగ్ ను కూడా చేస్తోంది. ఇటీవలే ఒక సూపర్ హిట్ ఐటెం సాంగ్ లో ఆడి పాడింది. మళ్లీ బంగారంలాంటి ఛాన్స్ ఈ అమ్మడికి దక్కింది.

అక్కినేని అభిమానులతో పాటు అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ బంగార్రాజులో ఈమెకు ఛాన్స్ దక్కింది. ఈ సినిమాలో హీరోయిన్ గా కాకున్నా కూడా ఈమె ఒక పాటలో కనిపించబోతుంది. కీల‌క పాత్ర కూడా పోషిస్తుంద‌ట‌. మోనాల్ సాంగ్ నాగార్జునతో పాటు నాగ చైతన్య ల‌తో ఉంటుందని సమాచారం అందుతోంది. ఈ సినిమా షూటింగ్ కోసం గత కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్న ఫిల్మ్ మేకర్స్ మరియు ప్రేక్షకులకు అతి త్వరలోనే బంగార్రాజు టీమ్ ఒక సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నట్లుగా అక్కినేని వర్గాల నుండి సమాచారం అందుతోంది.