Monal Gajjar : అనీ మాస్ట‌ర్ బిగ్ బాస్‌కి ఎందుకు వెళ్లిందో చెప్పిన మోనాల్‌

Monal Gajjar : బిగ్ బాస్ లో పాల్గొనాల‌నే క‌ల చాలా మందికి ఉంటుంది. కాని ఆ అవ‌కాశం కొంద‌రికే ద‌క్కుతుంటుంది. వ‌చ్చిన అవ‌కాశాన్ని ప్ర‌తి ఒక్క‌రు స‌ద్వినియోగం చేసుకుంటూ ఉంటారు. ఈ సారి సీజ‌న్ 5లో ఏకంగా 19 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. అందులో ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ది మంది ఎలిమినేట్ కాగా, తొమ్మిది మంది హౌజ్‌లో ఉన్నారు. వీరులో అనీ మాస్ట‌ర్ చాలా స్ట్రాంగ్ గా గేమ్ ఆడుతూ వ‌స్తుంది.

Monal Gajjar about anne master in bigg boss 5
Monal Gajjar about anne master in bigg boss 5

అనీ మాస్ట‌ర్‌.. కొంత‌కాలంగా ప‌లు ప‌వ‌ర్స్ వ‌ల‌న సేవ్ అవుతుంది. ఆమె నామినేష‌న్స్‌లోకి రావాల‌ని ఎప్ప‌టినుంచో ఎదురు చూస్తుందో వ‌ర్గం. ఎట్ట‌కేల‌కు ఈ వారం యానీ నామినేషన్‌లోకి రావ‌డంతో ఆమె ఎలిమినేట్ అవ‌డం ఖాయ‌మంటూ సోష‌ల్ మీడియాలో ఇప్ప‌టి నుంచే చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి.

Monal Gajjar about anne master in bigg boss 5
Monal Gajjar about anne master in bigg boss 5

అనీ మాస్ట‌ర్ ఎలిమినేట్ కానుంద‌నే వార్త‌లు బిగ్‌బాస్ బ్యూటీ మోనాల్ గ‌జ్జ‌ర్‌కు బొత్తిగా న‌చ్చిన‌ట్లు లేదు. ఏంటీ, అప్పుడే యానీకి గుడ్‌బై చెప్తున్నార‌ని అయోమ‌యానికి లోనైంది. యానీకి ఓటేసి ఆమెను సేవ్ చేయండంటూ అభిమానుల‌ను వేడుకుంది. ఈమేర‌కు ఆమెకు స‌పోర్ట్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో వీడియోలు పోస్ట్ చేసింది.

Monal Gajjar about anne master in bigg boss 5
Monal Gajjar about anne master in bigg boss 5

‘కొన్ని అన‌ధికారిక పోల్స్ అప్పుడే యానీ మాస్ట‌ర్‌కు బైబై చెప్పేస్తున్నాయి. ఆమెకు ఓటేయమ‌ని మోనాలియ‌న్స్‌ను వేడుకుంటున్నా.. యానీ నాకు వ్య‌క్తిగ‌తంగా తెలుసు. ఆమె ఎంతో స్ట్రాంగ్‌, జీవితంలో ఎవ‌రి స‌పోర్ట్ లేకుండా ఒంట‌రిగా పైకి వ‌చ్చింది.

సొంతిల్లు కొనుగోలు చేయాల‌న్న ఆశ‌తో ఆమె బిగ్‌బాస్ హౌస్‌కు వెళ్లింది. ఆమె క‌ల‌ నెర‌వాల‌ని కోరుకుందాం. ద‌య‌చేసి ఆమెకు ఓటేయండి’ అని అభిమానుల‌ను అభ్య‌ర్థించింది మోనాల్‌. ఇటీవ‌ల ఈ మాజీ బిగ్ బ్యూటీ త‌న‌పై వ‌చ్చిన ట్రోల్స్ కి గట్టిగా స‌మాధానం ఇచ్చిన విష‌యం తెలిసిందే.