బిందె పై నిలుచొని .. న‌క్కిలీసు గొలుసు పాట‌కు స్టెప్పులేసిన మోనాల్

Samsthi 2210 - January 8, 2021 / 11:31 AM IST

బిందె పై నిలుచొని .. న‌క్కిలీసు గొలుసు పాట‌కు స్టెప్పులేసిన మోనాల్

రఘు సంగీత సార‌థ్యంలో రూపొందిన న‌క్కిలీసు గొలుసు పాట ఎంత ఫేమ‌స్సో.. బిగ్ బాస్ షోతో మోనాల్ అంత ఫేమ‌స్‌. మ‌రి ఆ న‌క్కిలీసు పాట‌కు మోనాల్ స్టెప్పులేస్తే ఏ రేంజ్‌లో ఉంటుంది చెప్పండి. ఇక్క‌డ మ‌రో ట్విస్ట్ ఏంటంటే బిందెపై నిలుచొని కింద కాలు పెట్టకుండా మోనాల్ చేసిన డ్యాన్స్ అంద‌రి మ‌తులు పోగొడుతుంది. ప్ర‌స్తుతం ఈ వీడియో ఇంట‌ర్నెట్‌లో హ‌ల్ చ‌ల్ చేస్తుండగా, నెటిజ‌న్స్ మోనాల్ ప‌ర్‌ఫార్మెన్స్‌కు ముగ్ధుల‌వుతున్నారు.

తెలుగు సినిమాల‌తో గ‌తంలో ప‌ల‌క‌రించిన మోనాల్ గజ్జ‌ర్ బిగ్ బాస్ షో ఎక్క‌డ లేని క్రేజ్ పొందింది. దీంతో ఆమెకు ప‌లు షోస్‌, సినిమాలకు సంబంధించిన ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం డ్యాన్స్ ప్ల‌స్ అనే షో చేస్తున్న ఈ అమ్మ‌డు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెర‌కెక్కిన అల్లుడు అదుర్స్ అనే చిత్రంలో ఓ స్పెష‌ల్ సాంగ్‌కు నృత్యం చేసింది. ఈ సాంగ్ కోసం ఆమె అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల‌లో ఈ గుజ‌రాతీ అమ్మాయి పేరు మారు మ్రోగిపోతుంది. రోజు రోజుకు త‌న క్రేజ్ పెంచుకుంటూ పోతున్న మోనాల్ తాజా ప‌ర్‌ఫార్మెన్స్‌తో అంద‌రి మైండ్ బ్లాక్ చేసింది.

నీ పక్కన పడ్డాదొలేదో సూడొరి పిల్లా నాదీ నక్కిలీసు గొలుసు అంటూ సాగే పాటకు మోనాల్ బిందె పై నిలుచొని న‌డుం తిప్పుతూ, రౌండ్‌ తిరుగుతూ స్టెప్పులు వేసింది. ఆమె ప‌ర్‌ఫార్మెన్స్‌కు తోడు బాబా భాస్క‌ర్ మాస్ట‌ర్ వేసిన స్టెప్పులు కూడా నెటిజ‌న్స్‌కు మంచి వినోదాన్ని అందిస్తున్నాయి. అయితే ఇన్నాళ్ళు త‌న‌లో దాచుకున్న టాలెంట్‌ను ఇప్పుడిప్పుడే బ‌య‌ట‌కు తీస్తున్న మోనాల్ రానున్న రోజుల‌లో మంచి స్థాయికి వెళ్ల‌డం ప‌క్కా అని అంటున్నారు.

 

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us