Mohan Lal: మ‌హేష్ బాబు సినిమాలో మ‌ల‌యాళ మెగాస్టార్.. ఏ రోల్ ప్లే చేస్తున్నారో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

NQ Staff - February 16, 2022 / 12:10 PM IST

Mohan Lal: మ‌హేష్ బాబు సినిమాలో మ‌ల‌యాళ మెగాస్టార్.. ఏ  రోల్ ప్లే చేస్తున్నారో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Mohan Lal: సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం త‌న తదుపరి సినిమాల‌కు సంబంధించి ప్ర‌ణాళిక‌లు ర‌చించుకుంటున్నాడు. మే 12న సర్కారు వారి పాట‌ల‌తో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌నున్నాడు. ఈ సినిమా త‌ర్వాత త్రివిక్ర‌మ్ తో మూవీ చేయ‌నున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స‌ర్కారు వారి పాట‌ట సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.

Mohan Lal to Act in Mahesh Babu's Upcoming Movie

Mohan Lal to Act in Mahesh Babu’s Upcoming Movie


ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి పోస్టర్ ఈ మూవీ మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఇందులో మహేష్ సరికొత్త లుక్‏లో కనిపించనున్నారు.ఇటీవ‌ల ఈ పాట ప్రోమో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాతర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పూజాకార్యక్రమాలు జరిగాయి. ఈ సినిమాలో పూజాహెగ్డే ను హీరోయిన్ గా ఎంపిక చేశారు త్రివిక్రమ్.

ఇక సెకండ్ హీరోయిన్ గా ఇస్మార్ట్ బ్యూటీ నభానటేష్ , మలయాళీ బైట్ సంయుక్త మీనన్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పడు మరో ఇద్దరు భామల పేర్లు తెరపైకి వచ్చాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన ఖిలాడి సినిమాతో మంచి హిట్ అందుకున్నారు ముద్దుగుమ్మలు డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి. ఇప్పుడు ఈ ఇద్దరు భామల్లో ఒకరు మహేష్ సినిమాలో నటించబోతున్నారని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

మ‌రోవైపు ఈ సినిమాలో మోహన్ లాల్ కీలక పాత్రలో నటిస్తున్నారట. ఒక పవర్ ఫుల్ పొలిటిషన్ గా సీఎం పాత్రలో మోహన్ లాల్ కనిపించబోతున్నారని తెలుస్తోంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రనుందట. ఇక గత గతంలో మహేష్ బాబు త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో అతడు ఖలేజా చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

ఇప్పుడు 11 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ సినిమా రాబోతోంది. మరి కాగా గతంలో మోహన్ లాల్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ చిత్రంలో నటించారు. ఈ చిత్రం సూపర్ హిట్ సాధించింది.

Read Today's Latest గుసగుసలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us