Mohan laal : దర్శకుడిగా మారుతున్న మెగాస్టార్..!

Mohan laal : కొంత మంది హీరోలకి సీనియారిటీ వచ్చాకా దాదాపు అన్నీ విభాగాల మీద మంచి అవగాహన వచ్చేస్తుంది. ఈ క్రమంలో హీరోగానే కాకుండా మరో విభాగంలో కూడా సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తారు. కానీ ఆ ప్రయత్నాలు ఎంతవరకు సక్సస్ అవుతాయి అన్నది మాత్రం కొన్ని సందర్భాలలో బేరీజు వేసుకోవడం చాలా కష్టం. అయితే ప్రయత్న లోపం లేకుండా అనుకున్న పని చేయడం మాత్రం మానరు. హీరోలు నిర్మాతలుగా మారుతున్నారు. కొందరు పాటలు పాడుతున్నారు..మరికొందరు దర్శకులుగా మారుతున్నారు. ఈ క్రమంలోనే సీనియర్ హీరో దర్శకుడవుతున్నాడు.

mohan-laal- is going to become a director
mohan-laal- is going to become a director

మలయాళ మెగాస్టార్ గా పాపులారిటీని సంపాదించుకున్న మోహన్ లాల్ మెగా ఫోన్ పట్టబోతున్నాడు. ఆయన దర్శకత్వం వహిస్తున్న మొదటి సినిమా ‘బరోజ్’. వాస్కోడిగామా భారతదేశంలోని తన నిధికి కాపలాగా ఉంచిన బరోజ్ అనే భూతం జీవితానికి సంబంధించిన కథ అని సమాచారం అందుతోంది. ఆ నిధికి అసలైన వారసుడి కోసం ఎదురు చూస్తున్న భూతాన్ని వెతుక్కుంటూ వచ్చిన ఓ కుర్రాడికి బరోజ్ కు మధ్య సాగే ప్రయాణమే ఈ సినిమా కథట.

Mohan laal : మోహన్ లాల్ జనతా గ్యారేజ్ సినిమాలో కీలక పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.

కాగా ఈ సినిమాలో బరోజ్ పాత్రలో మోహన్ లాల్ నటిస్తుండగా.. మరో ముఖ్య పాత్రను పృథ్వీరాజ్ సుకుమార్ పోషిస్తున్నాడు. 3డీ ఫార్మాట్ లో పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమా రూపొందనుండగా తాజాగా పూజా కార్యక్రమాలతో ఘనంగా  ప్రారంభమైంది. త్వరలోనే ‘బరోజ్’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి కొచ్చి గోవా డెహ్రాడూన్ తో పాటు పోర్చుగల్ లో కూడా చిత్రీకరణ జరుపనున్నారట. కాగా మోహన్ లాల్ నటించిన పలు చిత్రాలు తెలుగులోనూ డబ్ అయిన సంగతి తెలిసిందే. అలాగే ఎన్.టి.ఆర్ నటించిన జనతా గ్యారేజ్ సినిమాలో కీలక పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.

Advertisement