Mohan Babu: నీ అమూల్య‌మైన ఓటు మంచు విష్ణుకి వేయ‌మ‌న్న మోహ‌న్ బాబు

Mohan Babu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీలో సినిమా టికెట్లను ఏపీ ప్రభుత్వం హ్యాండోవర్ చేసుకునే అంశంలో ఏపీ సీఎం జగన్ ను, వైసీపీ నేతలపై చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర వివాదాలకు చోటు చేసుకుంది. అలాగే సినీ ఇండస్ట్రీలో నటులు ఇప్పటికే పవన్ కు సపోర్ట్ గా నిలిచారు.

Mohan Babu Requested Pawan Kalyan to Vote for Manchu Vishnu
Mohan Babu Requested Pawan Kalyan to Vote for Manchu Vishnu

పవన్ కళ్యాణ్ కామెంట్స్ లో భాగంగా వైసీపీకి మద్దతుగా నిలిచే మోహన్ బాబు కి సైతం పవన్ కళ్యాణ్ కౌంటర్ వేసిన సంగతి తెలిసిందే. సినిమా టికెట్ ఆన్ లైన్ చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నప్పుడు, రేపటి రోజున మీ విద్యానికేతన్ లో సీట్లు కూడా ప్రభుత్వమే ఆన్ లైన్ భర్తీకి శ్రీకారం చుడుతుందని, అది మీకు పర్వాలేదా అంటూ పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ క్రమంలో మోహన్ బాబు పవన్ కళ్యాణ్ కామెంట్స్ కి రిప్లై ఇస్తూ.. ఓ లెటర్ ని కూడా సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.

ఈ లేఖలో నా చిరకాల మిత్రుని సోదరుడైన పవన్ కళ్యాణ్, నువ్వు నాకంటే చిన్నవాడివి కనుక ఏకవచనంతో సంభోదించానని, అయినా పవన్ కళ్యాణ్ గారు అని పిలవడంలో కూడా తప్పేమి లేదన్నారు. చాలా కాలానికి నన్ను మెల్లగా లాగావ్, సంతోషమే. కానీ ఇప్పడు మా ఎలక్షన్స్ జరుగుతున్నాయి.

నా కుమారుడు మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నిలబడిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 10 వ తేదీన ఎలక్షన్స్ అయిపోతాయని, ఆ తర్వాత నువ్వు అడిగిన ప్రతీ విషయానికి నేను హృదయపూర్వకంగా సమాధానం చెబుతానని మోహన్ బాబు అన్నారు.

అయితే ఈలోగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే.. తన అమూల్యమైన ఓటుని నీ సోదరసమానుడైన మంచు విష్ణుకి వేసి అతని ప్యానల్ ను గెలిపించాలని కోరుకుంటున్నానని, థ్యాంక్యూ వెరీ మచ్.. మోహన్ బాబు అని పేర్కోన్నారు. ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.